NATIONAL

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్ ను ప్రకటించిన కేంద్రం

అమరావతి: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 78 రోజుల దీపావళి బోనస్ ను ప్రకటించింది.11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మొత్తం రూ.1823 కోట్లను పండుగ బోనస్ గా చెల్లిస్తామని వెల్లడించింది.బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వరంగంలోని మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ల నష్టాల భర్తీకి రూ.22 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్యకాలంలో ఎల్పీజీ గ్యాస్ ను మార్కెట్ ధర కంటే తక్కువకు ఆయిల్ కంపెనీలు విక్రయించిన సందర్భాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ గ్రాంట్ ను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ  వ్యవధిలో ఎల్పీజీ ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు 300 శాతం పెరిగాయని అనురాగ్ ఠాకూర్ గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.600 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. “మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల బిల్లు 2022”కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. దీనివల్ల దేశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ కు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల్లో పారదర్శకతను పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని వెల్లడించారు. 

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

3 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

3 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

5 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.