NATIONAL

పిల్లల ఆధార్‌ అప్ డేట్ సేవాలు పూర్తిగా ఉచితం-యుఐడీఏఐ

అమరావతి: పిల్లల ఆధార్‌ అప్ డేట్ చేసేందుకు ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలు,యుఐడీఏఐ సూచించిన ఛార్జీలు కాకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ ఛార్జీల వసూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది.ఆధార్‌ అప్‌డేట్‌ కోసం వచ్చిన వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని భారత ఆధార్‌ సంస్థ(UIDAI) ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ఉచిత సర్వీసు కేవలం “బాల్‌ఆధార్‌లో అప్‌డేట్‌ ” చేసుకునేందుకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా బాల్‌ఆధార్‌ అప్‌డేట్‌ కోసం డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయాలని సూచించింది. వినియోగదారులు 1947 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, లేదా help@uidai.gov.in ఈమెయిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. యూఐడీఏఐ బాల్ ఆధార్/ పిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి ఇటీవల కొత్త సూచనలు జారీ చేసింది.5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు,, ఆధార్ రికార్డులలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది.5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని యూఐడీఏఐ ట్విట్టర్‌లో ప్రకటించింది. బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్లు మారవని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్‌ కార్డ్‌ను అప్లై చేయడానికి, పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

13 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

15 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

19 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

19 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.