AMARAVATHI

కాంగ్రెస్ పార్టీ నాకు సమాధి నిర్మించాలని శతవిదాలు ప్రయత్నిస్తొంది-ప్రధాని మోదీ

బెంగళూరు-మైసూరు 6 లేన్స్ ఎక్స్ప్రెస్వే..

అమరావతి: కాంగ్రెస్ పార్టీ తనకు సమాధి నిర్మించాలని శతవిదాలు ప్రయత్నిస్తొందని,,అయితే తాను దేశంలో రోడ్లను నిర్మించే పనిలో ఉన్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో బెంగళూరు-మైసూరు మధ్య రూ.8,480 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరచిన 118 కిలోమీటర్ల పొడవైన 6 లేన్స్ ఎక్స్ప్రెస్వేని ప్రధాని ప్రారంభించి సందర్బంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..మోదీకి సమాధి కట్టాలని వారనుకుంటున్నా, దేశంలోని తల్లులు, సోదరీమణులు, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా ఉన్నారని చెప్పారు..డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కర్ణాటక అభివృద్ధి మరింత వేగంగా జరుగుతొందని చెప్పారు..కాంగ్రెస్ పార్టీ 2014కు ముందు పేద ప్రజల ఆర్దిక పరిస్థితిని పతనం అంచులకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలు ఎదైనా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాలంటే కాళ్లరిగేలా కార్యాలయం చుట్టు తిరగాల్సి వచ్చేదని,, బీజేపీ హయాంలో నేరుగా ఇంటి వద్దకే పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు.. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు..అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన కర్ణాటకతో పాటు దేశమంతటా జరుతున్నయన్నారు.. మౌలిక సదుపాయాల కల్పనతో ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయని,,దింతో ప్రజల ఆదాయ కూడా పెరుగుతొందన్నారు..గత 9 సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 2 కోట్లకు పైగా పేద ప్రజలకు ఇళ్లు కట్టించడం జరిగిందని,, ఒక్క కర్ణాటకలో లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు..జల్ జీవన్ మిషన్ కింద 40 లక్షల కుటుంబాలకు కుళాయి నీటిని అందించామన్నారు..చెరకు రైతులకు బడ్జెట్‌లో అనేక వెసులుబాట్లు కల్పించామని చెప్పారు..2013-14 నుంచి రూ.17, 000 కోట్ల ఇథనాల్‌ను చక్కెర కర్మాగాల నుంచి కొనుగోలు చేస్తామని,,ఈ సొమ్ము చెరకు పండించే రైతులకు చేరుతుందని అన్నారు..బయోటెక్నాలజీ నుంచి రక్షణరంగ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ నుంచి ఈవీ‌ల వరకూ కర్ణాటక ఈ కొత్త పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉందని చెప్పారు..

(బెంగళూరు-మైసూరు మధ్య 6 లేన్స్ నిర్మాణంతో ప్రయాణ సమయం 3 గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుంది.. మాండ్య,, హుబ్లి-ధార్వాడ్ జిల్లాలో రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా మోదీ ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.)

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

12 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

13 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

13 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

14 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

1 day ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.