AMARAVATHI

గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా-హైకోర్టు

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

అమరావతి: విశాఖపట్నంలోని రిషికొండపై అక్రమ తవ్వకాలపై జరుగుతున్నఅంటూ దాఖలైన పిటీషన్ పై తవ్వకాల వివరాలపై కమిటీ వేస్తే అభ్యంతరం ఎందుకంటూ,రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట జనరల్ నిరంజన్ రెడ్డిని,, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. గురువారం హైకోర్టులో రిషికొండ అక్రమ తవ్వకాలు విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది పేరిట కొండలను త్రవ్వేస్తున్నరని,,ఇదే సమయంలో రాజధాని అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఇతర ప్రాంతానికి రానివ్వమంటున్నారని,, ప్రభుత్వంలో విభిన్న వైఖరిలు ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తుంది అంటూ న్యాయమూర్తి ఘటుగా వ్యాఖ్యనించారు..కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయమని పంపుతామని హైకోర్టు పేర్కొంది. 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే,, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు కే.ఎస్‌ మూర్తి, అశ్వినీ కుమార్ లు హైకోర్టుకు తెలిపారు. గూగుల్ మ్యాప్‌లను పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు అందజేశారు. తాము 9.88 ఎకరాలకే పరిమితమయ్యామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకు వివరించే ప్రయత్నం చేయగా,, న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా అంటూ ప్రశ్నించారు. తాము ఆఫిడవిట్ దాఖలు చేస్తానమని,,అంత వరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది,న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. మీరు అఫిడవిట్ వేసిన తరువాత నిజా, నిజాలు తేలుస్తామని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశిస్తూ ధర్మాసనం పేర్కొన్నంటూ, కేసు విచారణను నవంబర్ 3కు న్యాయమూర్తి వాయిదా వేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

17 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

18 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

22 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.