AMARAVATHI

దిల్లీ మద్యం స్కామ్‌ కేసులో మాగుంట,కవితలపై గురి పెట్టిన ఈడీ

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ మద్యం స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది..ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ,,దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది.(దిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు)లో ఈడీ సోదాలు చేస్తోంది..దిల్లీ మద్యం కుభకోణంలో,,TRS MLC కేసీఆర్ కుమారై కవిత,,YSRCP MPఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిల పైనా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ గురిపెట్టింది..ఈడీ బృందాలు తెలంగాణ, చెన్నై, నెల్లూరు, దిల్లీలోని మాగుంట నివాసాల్లో ఏకకాలంలో 25 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు..ఇంతకు ముందు ఈడీ హైదరాబాద్‌లో సోదాలు చేసింది.. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది..సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్​లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా,, సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది.. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్​లో డైరెక్టర్​గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్​గా ఉన్నారు.. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది..అలాగే కోకాపేట్​లోని రామచంద్ర పిళ్లై నివాసంలోనూ ఈడీ అధికారుల సోదాలు చేశారు..పలువురి రాజకీయ ప్రముఖులతో రామచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు అనుమానించిన అధికారులు తగిన ఆధారాలు సేకరించారు..

నెల్లూరు:- నగరంలోని రాయాజీ వీధిలోని ఎం.పీ మాగుంట.శ్రీనివాసులరెడ్డి నివాసంలోను, ఆఫీసుల్లో,,అలాగే బుచ్చిరెడ్డిపాళెం,రేబాలలో నివాసం వుంటున్న మాగుంట బంధువు అయిన ఏటూరు.శివరామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.. ఇంట్లోను తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత:- మద్యం స్కామ్‌ కేసులో కవిత మెడకు కాస్త గట్టిగానే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది..శుక్రవారం కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించింది..అలాగే కవితకు ఈడీ నోటీసులు పంపించింది..ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది..హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది..

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

42 mins ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

3 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

6 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

7 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

11 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.