INTERNATIONAL

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్-ప్రధాని మోదీ

అమరావతి: షాంఘై సహకార సంస్థ (SEO) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌ చేరుకొగా,,ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్,ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి స్వాగతం పలికారు.. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్​ఖండ్​ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్​ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నానని,,భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7.5 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని తెలిపారు..SEO సభ్య దేశాలు,,ఇతర సభ్యదేశాలకు ట్రాన్సిట్ యాక్సెస్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు..”మేము దేశ ప్రజల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని,,ప్రతీ రంగంలో ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నామన్నారు..నేడు భారత్​లో 70 వేల కంటే ఎక్కువ స్టారప్​ కంపెనీలు, 100కు పైగా యూనికార్న్​లు సేవాలు అందిస్తున్నాయన్నారు..కొవిడ్ మహ్మమారిని ప్రపంచం అధిగమిస్తున్నప్పటికి,,ఉక్రెయిన్​ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలకు సరఫరాల విషయంలో అనేక అంతరాయాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు..ఇలాంటి పరిస్థితుల్లో భారత్​ను ఓ తయారీ కేంద్రంగా మార్చాలని  ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నట్లు చెప్పారు..గుజరాత్‌లో సంప్రదాయ ఔషధాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ఏప్రిల్​లో,,తొలి గ్లోబల్ సెంటర్‌ను ప్రారంభించిందన్నారు..

ఆతిథ్యంకు సహకరిస్తాం:- వచ్చే సంవత్సరం షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుడడంతో,, భారత్​ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు..తాము సదస్సు విషయంలో పూర్తి మద్దతు సహకారం అందిమని తెలిపారు..

షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైంది..ఇందులో 8 పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చైనా, రష్యా, భారత్ తో పాటు కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, పాకిస్థాన్‌లు వున్నాయి..మోదీ-జిన్ పింగ్, మోదీ-పుతిన్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..మోదీ, తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ మధ్య చర్చలు జరుగుతాయని రష్యా ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది..వ్యూహాత్మక స్థిరత్వంతో పాటు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని సమస్యలు వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..

 

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

10 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

11 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

16 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

2 days ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

2 days ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

This website uses cookies.