AMARAVATHI

ఐదుగురు అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్,రూ. 4.49 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి..

తిరుపతి: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో తమిళనాడుకు చెందిన 5 మంది అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు 4.49 కోట్ల రుపాయుల విలువగల ఎర్ర చందనం, 2 కార్లు స్వాదీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి చెప్పారు.సోమవారం తిరుపతి పోలీసు పెరేడ్ మైదానం నిర్వహించిన మీడియా సమావేశలో అయన మాట్లాడుతూ సుమారు 5,388 Kg ల 275 ఎర్ర చందనం దుంగలు, ముక్కలు, పొడి అలాగే రూ.18,00,000  విలువ గల రెండు కార్లు, నగదు 3200/- రూపాయలు, 6 సెల్ ఫోన్స్ ఉన్నాయన్నారు.. విశ్వనీయమైన సమాచారం అందడంతో NH-16 జాతీయ రహదారిపై పెద్ద పన్నంగాడు ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద సూళ్లూరుపేట సిఐ మధుబాబు, తడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డి, సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు,,తడ, సూళ్ళురుపేట పొలీస్ స్టేషన్ ల సిబ్బంది మాటువేసి స్మగ్లర్లను అరెస్టు చేశారన్నారు.. పట్టుబడిన ముద్దయిలందరూ తమిళనాడుకు చెందినవారన్నారు.. A1.మురుగన్ ఇదివరకే PD-ACT క్రింద జైలు శిక్షను అనుభవించి, జూన్ నెలలో విడుదల అయ్యాడు..అయినప్పటికీ మళ్ళి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతుండని తెలిపారు..

అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు ఇలా వున్నాయి..1. మురుగన్ @ మురుగానంద్, తండ్రి: పాలయన్, వయస్సు:42 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం రవాణాదారుడు)..2. హేమంత్ కుమార్ @ రాజ @ హరి, తండ్రి: కుప్పుస్వామి, వయస్సు:37 సం’లు, పల్లవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం అమ్మే మధ్యవర్తి)..3. రవి, తండ్రి: సురేష్, వయస్సు:31 సం’లు, మనివాక్కం, చెన్నై, తమిళనాడు.( డ్రైవర్ & వర్కర్).. 4. విమల్, తండ్రి: రాజేంద్రన్, వయస్సు:32 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్)..5. సురేందర్, తండ్రి: గుణశేఖర్, వయస్సు:33 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్).. పట్టుపడిన ముద్దాయిలందరిపై PD-ACT ప్రయోగిస్తామన్నారు.. ఈ దాడుల్లో తడ, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

10 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

11 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

12 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

12 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.