AMARAVATHI

హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు, చిక్కుకుపోయిన 200 పర్యాటకులు

అమరావతి: హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు రావడంతో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకుపోయారు.. మండి జిల్లా పదార్ DSP సంజీవ్ సూద్ మాట్లాడుతూ బాగిపుల్ ప్రాంతంలో ప్రషార్ సరస్సు సమీపంలో వరదల సంభవించాయన్నారు.. పర్యాటకులు, స్థానికులతోసహా 200 మందికిపైగా ప్రజలు మండి ప్రశార్ రోడ్డులోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారని,,ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.. చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు,, పరాశర్ నుంచి తిరిగి వస్తున్న అనేక వాహనాలు చిక్కుకున్నాయని పేర్కొన్నారు..ఆకస్మిక వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి హైవే మూసుకుపోవడంతో హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని ఔట్ సమీపంలో వందలాది మంది ప్రయాణికులు మార్గం మధ్యలో అగిపోవాల్సి వచ్చింది..హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాంగ్రా సిటీలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి..మండి-జోగిందర్ నగర్ హైవేని తాత్కలికంగా అధికారులు మూసివేశారు..కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఈ రహదారులపై ప్రయాణించే సాధారణ ప్రజలు, పర్యాటకులు పర్వాతాలకు ఆనుకొని ఉన్న రోడ్లపై ఉండరాదని పోలీసులు సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

9 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

12 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

17 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

2 days ago

This website uses cookies.