AMARAVATHI

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు..

అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు బ‌దిలీపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది..పోలింగ్ త‌రువాతే న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఆదేశించింది.. గురువారం సంక్షేమ పథకాలకు  నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.. ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పుడు నిధులు విడుదలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌లు దాఖలు చేసింది..జనవరి నుంచి మార్చి 16 వరకు వివిధ పథకాలకు బటన్ నొక్కి,, అప్పుడు నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందు నిధులు ఎలా విడుదల చేస్తారని ఈసీ ప్రశ్నించింది.. సైలెంట్ పీరియడ్‌లో నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది..ఈ కారణంగా ఓటర్లపై ప్రభావం వుంటుందని పేర్కొంది.. తాము ఆన్ గోయింగ్ స్కీమ్స్‌కు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు..నాలుగు రోజుల్లో తరువాత ఈనెల 14వ తేదీన విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది చెప్పారు..గతంలో తాము జూన్ 6 వరకు నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని చెప్పినా, ప్రస్తుతం మాత్రం పోలింగ్ పూర్తైన తర్వాత విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని ఈసీ న్యాయవాది పేర్కొన్నారు..ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Spread the love
venkat seelam

Recent Posts

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

24 mins ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

2 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

2 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

20 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

This website uses cookies.