NATIONAL

జోషిమఠ్‌ ప్రాంతంలోవాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు-మునిపిపాల్ చైర్మన్

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌ ప్రాంతంలోని ఇళ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని శుక్రవారంనాడు ఆదేశించింది..దీంతో జిల్లా యంత్రాగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతోంది..గార్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజిమెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు..డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద హోటల్ వ్యూ, మలరి ఇన్‌లో పర్యాటకులను రాకపోకలను నియంత్రించారు..మార్వాడి వార్డులో గ్రౌండ్ నుంచి వాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు వచ్చినట్టు జోషిమఠ్ మున్సిపల్ చైర్మన్ శైలేంద్ర పవార్ వెల్లడించారు.. కొండ చరియలు కారణంగా జోషిమఠంలో నిరాశ్రయులైన కుటుంబాలకు తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేయాలని హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (HCC), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)లను ఛమోలీ జిల్లా యంత్రాగం కోరింది…జోషిమఠ్‌లో నెలకొన్ని పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నమని,,అధికారుల నుంచి నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి శుక్రవారం భరోసా ఇచ్చారు..శనివారం తానే స్వయంగా జోషిమఠ్ వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు..బీజేపీకి చెందిన ఒక బృందాన్ని కూడా జోషిమఠ్‌కు పంపుతున్నట్టు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

16 mins ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

51 mins ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

19 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

24 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

This website uses cookies.