SPORTS

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్రకు అడుగు దూరంలో భారత షట్లర్లు

అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. సాత్విక్ రాజు,,చిరాగ్ శెట్టి వరల్డ్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో గెలిచి సెమీస్ లో అడుగుపెట్టారు.. మెడల్ కన్ఫర్మ్ చేసుకున్నారు. టోక్యో వేదికగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ బ్యాడ్మింటన్‌ జోడీతో తలపడి ఈ రికార్డు సాధించింది..దీంతో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ ఛాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో తొలిసారి పతకం అందుకోనున్న జంటగా సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ నిలిచిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది..BWF వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2022లో భాగంగా చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌సాయిరాజుల టీమ్,,రెండో సీడ్‌ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్‌)తో క్వార్టర్‌ ఫైనల్లో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ తొలి గేమ్‌లో తీవ్ర ప్రతీఘటన ఎదురైనా, భారత జోడీ 24-22తో పైచేయి సాధించింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్‌ షట్లర్ల ద్వయం,చిరాగ్‌- సాత్విక్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,, 21-15తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట 21-14తో టకురో హోకి- యుగో కొబయాషిలపై పట్టు బిగించి విజయం సాధించారు..దింతో సెమీఫైనల్ కు చేరి కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

44 mins ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

20 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

20 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.