AMARAVATHI

ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా ? సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఎల‌క్టోర‌ల్ బాండ్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రించింది. రాజకీయ పార్టీలు,,ఎన్నికలు,,పార్టీల నిర్వహణ కోసం ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా లేదా అన్న పిటీష‌న్ల‌పై సుప్రీమ్ కోర్టు గురువారం తీర్పును వెలువ‌రించింది..సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం  తీర్పును ఇస్తూ బ్లాక్ మ‌నీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదు అని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, బీఆర్ గ‌వాయి, జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాలు ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు. ఎన్నిక‌ల బాండ్ల‌పై ఏక‌గ్రీవ తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు సీజేఐ వెల్ల‌డించారు.. ధ‌ర్మాస‌నంలోని స‌భ్యుల మ‌ద్య రెండు అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి.. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నాతో పాటు తాను కూడా ఒకే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు సీజేఐ తెలిపారు.. స‌రైన ఓటింగ్ ప్ర‌క్రియ‌ను తెలుసుకునేందుకు రాజ‌కీయ నిధుల గురించి స‌మాచారం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీజేఐ అన్నారు..ఆర్టిక‌ల్ 19(A)(A) ప్ర‌కారం స‌మాచార హ‌క్కు (RTA)ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుందన్నారు..

ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని,,ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేసే బ్యాంకులు త‌క్ష‌ణ‌మే బాండ్ల‌ను నిలిపివేయాల‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది.. నిధులు అందుకున్న రాజ‌కీయ పార్టీలు వివ‌రాల‌ను ఎస్‌బీఐ బ్యాంకు మార్చి 6వ తేదీలోగా ఎన్నిక‌ల సంఘానికి ఆ వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుందని సూచించింది.. మార్చి 13వ తేదీ వ‌ర‌కు త‌మ అధికారిక వెబ్‌సైట్ ఎన్నిక‌ల సంఘం ఆ స‌మాచారాన్ని పోస్టు చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఎన్నిక‌ల బాండ్ల‌ను రాజ‌కీయ పార్టీలు ఖాతాలో జ‌మా చేయ‌కుంటే, వాటిని రిట‌ర్న్ చేయాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌:- ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను జనవరి 2వ తేది 2018న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది… ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పారదర్శకత పద్ధతిలో నిధులు సేకరిస్తున్నాయి.. పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం,, భారతదేశంలోని ఏ పౌరుడు లేదా స్థాపించబడిన సంస్థలు లేదా వ్యక్తిగతంగా లేదా కొంతమంది వ్యక్తుల సమూహం కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించే వెసులుబాటు ఉంటుంది..అర్హత కలిగిన రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే విరాళాలను పొందాల్సి ఉంటుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

14 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

17 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

17 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

19 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.