AMARAVATHI

ఇస్రో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం-తొలి ప్రవేట్ రాకెట్ ప్రయోగం

విజయవంతంగా నింగిలోకి విక్రమ్-ఎస్..

అమరావతి: తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి తొలి ప్రైవేట్ రాకెట్‌ విక్రమ్-ఎస్ నింగిలోకి విజయవంతంగా చేరుకుంది. విక్రమ్‌- ఎస్‌ రాకెట్‌ 6 మీటర్లు పొడవు, 543 కిలోల బరువు కలిగి ఉంది. షార్ కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల మధ్య ఈ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ మూడు కస్టమర్ పేలోడ్లుతో అంతరిక్షలోకి సాగింది. ప్రయోగ సమయం కేవలం 4 నిమిషాల 50 సెకండ్ల వ్యవధిలో భూ ఉపరితలం నుంచి 103 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ అయిన స్కైరూట్‌ ఏరో స్పేస్‌ అభివృద్ధి చేసిన విక్రమ్‌-ఎస్ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది.ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ తొలి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేసినట్లు తెలిపారు.విక్రమ్‌-స్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందని, ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల్లో ఇది ఆరంభమేనని అన్నారు.వచ్చే సంవత్సరం ప్రయోగించబోతున్న విక్రమ్-1 ఆర్బిటాల్ వాహనంలో ఉపయోగించే 80% సాంకేతికతలను ధృవీకరించడంలో ఈ ప్రైవేటు రాకెట్ ఉపయోగపడనున్నది.ఈ ప్రయోగంను వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ హాజరయ్యారు.

2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ రంగానికి అనుమతి లభించింది.అనుమతులు వచ్చిన వెంటనే స్కైరూట్‌ ఏరో స్పేస్‌ ఈ రాకెట్ ను రెండు సంవత్సరాల వ్యవధిలో,అతి తక్కువ ఖర్చుతో తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్ కుమార్ ఇది వరకే తెలిపారు.ఈ రాకెట్ ప్రయోగం కోసం స్కైరూట్‌ ఏరో స్పేస్‌ సంస్థ దాదాపు రూ.408 కోట్ల రూపాయలను సమీకరించింది.భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకు నాంది పలికిన ప్రముఖశాస్త్రవేత్త డా.విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా స్కైరూట్‌ ఆయన పేరు పెట్టింది.

Spread the love
venkat seelam

Recent Posts

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

8 mins ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

4 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

18 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

This website uses cookies.