INTERNATIONAL

పద్మభూషన్ అవార్డును అందుకున్న మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్ల

అమరావతి: భారత సంతతికి చెందిన అందునా హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల,,ప్రస్తుతం మైక్రోసాఫ్ సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనాదెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా సత్యనాదెళ్ల పద్మభూషన్ అవార్డును అందుకున్నారు.ఆవార్డు ప్రకటించిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అవార్డును అందుకునేందుకు సత్యనాదెళ్ల భారత్ కు రాలేకపోవడంతో, శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు..ఈ అవార్డు అందుకున్న సందర్బంలో అయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఆవార్డు అందుకోవడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు..రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు దేశ ప్రజలకు సత్యనాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు..దేశంలో సమ్మిళిత వృద్ధికి సాధికారత కల్పించడంలో డిజిటల్ టెక్నాలజీ పోషిస్తున్న కీలక పాత్ర పై ప్రసాద్ తో చర్చించారు..రాబోయే దశాబ్ధంలో డిజిటల్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని నాదెళ్ల చెప్పారు..వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నారని,ఇది గొప్ప ఆవిష్కరణకు దారి తీస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు..సాంకేతికతను మరింత పెంచే విధంగా దేశం అంతా తిరిగి ప్రజలతో కలిసి పని చేయడం కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే భారతదేశ అత్యున్నత పురస్కారాలలో పద్మ అవార్డులు ఒకటి.ఈ సంవత్సరం(2022) పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన 17 మంది అవార్డు గ్రహీతల్లో సత్యనాదెళ్ల ఒకరు..

Spread the love
venkat seelam

Recent Posts

356 మందిని గుర్తించాం, కొంత మందిని అరెస్ట్ చేశాం-డీజీపీ

సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…

10 hours ago

బుధవారం నీటి సరఫరాకు అంతరాయం-కమీషనర్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…

11 hours ago

రేవ్ పార్టీకి రింగ్ మాస్టారు కాకాణి-సోమిరెడ్డి

అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో…

15 hours ago

ఎన్నికల ప్రవర్తననియమావళి ఉల్లంఘన జరగకుండా చూడాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…

15 hours ago

ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు-DRO

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…

16 hours ago

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

2 days ago

This website uses cookies.