HYDERABAD

వైఎస్ వివేకా హత్య కేసు అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో ఏ.పి సి.ఎం పేరు ?

హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సంచలన విషయాలు ప్రస్తావించింది.. అఫిడవిట్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించింది..వివేకా హత్య విషయాన్ని జగన్ కు అవినాశ్ రెడ్డి చెప్పారా ? లేదా? అనేదానిపై దర్యాఫ్తు చేయాల్సి ఉందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.. వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6 గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ తెలిపింది.. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయట పెట్టకముందే వివేకా మృతి గురించి జగన్ కు తెలుసని సీబీఐ అధికారులు కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు..అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ కీలక అంశాలు వెల్లడించింది..అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీబీఐ,,విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని పేర్కొంది..ఇప్పటి వరకు జరిగిన విచారణలో అవినాశ్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పారని సీబీఐ అధికారులు తెలిపారు..అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సీబీఐ తెలిపింది..హత్య వెనక భారీ కుట్ర చెప్పేందుకు అవినాశ్ ముందుకు రావడం లేదని వెల్లడించింది..హత్య జరిగిన రాత్రి 12.27 నుంచి 1:10 వరకు అవినాశ్ వాట్సాప్ కాల్స్ మాట్లాడారని పేర్కొంది..

” ఈ నెల 15న నోటీస్ ఇస్తే నాలుగు రోజుల సమయం కావాలన్నారు..ఈ నెల 16న నోటీస్ ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు. ఈ నెల 19న తల్లి అనారోగ్యం నెపంతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ విడిచి వెళ్లారని,, విచారణకు రావాలని అవినాశ్ కు ఫోన్ చేసి కోరినప్పటికీ రాలేదని తెలిపింది..ఈ నెల 22న రావాలని నోటీస్ ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల వారం రోజులు రానన్నారని పేర్కొంది..జూన్ 30వ తేది లోపు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కౌంటర్ అఫిడవిట్” లో సీబీఐ కోరింది.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అవినాశ్ రెడ్డి. దీనిపై నిన్న(మే 25) విచారించిన కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. శుక్రవారం సుదీర్ఘంగా 7 గంటల పాటు తెలంగాణ హైకోర్టు విచారించింది..అవినాశ్ తరపు న్యాయవాది సుదీర్ఘంగా 5 గంటల పాటు వాదనలు వినిపించారు..ఇక ఈ రోజు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో సీబీఐ అధికారులు అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు..అందులో సీబీఐ అధికారులు ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించారు..6.15 గంటల ప్రాంతంలో వివేకా హత్య జరిగినట్లు పీఏ కృష్ణారెడ్డికి తెలిసినప్పటికి కూడా అతడు చెప్పకుండానే సీఎం జగన్ కి ఏ విధంగా తెలిసింది? అవినాష్ రెడ్డే చెప్పారా? లేక మరెవరైనా సీఎం జగన్ కి చెప్పారా? దీనికి సంబంధించి పూర్తి దర్యాఫ్తు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది..ముఖ్యమంత్రి జగన్ కి ఏ విధంగా హత్య గురించి తెలిసింది? ఎన్ని గంటలకు తెలిసింది? అనేదానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉందని,, వివేకా పీఏ కృష్ణారెడ్డి చెప్పలేదు? మరి జగన్ కు ఎవరు చెప్పి ఉంటారు? అనేది తెలియాల్సి ఉంది.. దీనిపై పూర్తి దర్యాఫ్తు చేయాల్సి ఉందని కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది.

 

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

5 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

5 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

8 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

8 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

9 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

9 hours ago

This website uses cookies.