INTERNATIONAL

మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షడు గొటబాయ రాజపక్సే

అమరావతి: తీవ్ర ఆర్దిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి.. ప్రజల ఆగ్రహం చూసి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా దేశం విడిచి, మాల్దీవులకు పారిపోయాడు..విషయం తెలుసుకున్న ప్రజలు ఉదయం నుంచే మళ్లీ రోడ్డెక్కారు..కొలంబోలోని తాత్కలిక ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది ర్యాలీగా బయల్దేరారు..ఉద్రికత్త పరిస్థితులను గమనించి,,దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు తాత్కలిక ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం ప్రకటించారు..కొలంబో సహా పశ్చిమ ప్రావిన్స్‌ లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు..ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు..ఇదే సమయంలో తాను, తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు..మాల్దీవులకు పారిపోయిన గొటబాయ రాజపక్స తక్షణమే రాజీనామా చేయాలని శ్రీలంకవాసులు డిమాండ్ చేస్తూ రోడ్లెక్కారు..ప్రధానమంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టారు..ఆందోళనకారులు, ప్రధాని కార్యాలయం ఆవరణ నుంచి వెళ్లిపోవాలని భద్రతా బలగాలు హెచ్చరించాయి..దీంతో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి..గుంపులు గుంపులుగా వస్తున్న ప్రజలను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలను బలగాలు ప్రయోగించారు.

పారిపోయిన రాజపక్సే:-మిలటరీ విమానంలో, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి,,మిలిటరీ విమానంలో మాల్దీవులు పారిపోయారు..ఆ తరువాత కొంతసేపటికి,మాల్దీవులోని, మాలే నగరంలోని వెలానా ఎయిర్‌పోర్టులో ఆయన ప్రత్యక్షమయ్యారు..గొటబాయతోపాటు ఆయన సతీమణి, ఇద్దరు బాడీగార్డులు వెంటవున్నారు..మాలేలోని ఎయిర్‌పోర్టులో దిగాక పోలీస్ ఎస్కార్ట్‌ తో రహస్య ప్రాంతానికి తరలించారు..

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

17 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

17 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

21 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.