DISTRICTS

సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల ద్వారా జిల్లాకు సాగు,తాగునీరు అందుతుంది-సీ.ఎం జగన్

టీడీపీపై విరుచుకుని పడిన సీ.ఎం జగన్….

నెల్లూరు: సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను జాతికి అంకితమిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు..సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతమ్‌రెడ్డిగా నామకరణం చేసుకున్నామని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.మంగళవారం చాపర్ లో సంగంకు చేరుకున్న సీ.ఎం జగన్  జల పూజ చేసి, గంగమ్మ తల్లికి సారే (పట్టు వస్త్రాలు) సమర్పించారు..మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించిన అనంతరం రోడ్డు మార్గంలో సంగం-కలిగిరి రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీ.ఎం మాట్లాడుతూ రూ.380 కోట్లు ఖర్చు చేసి సంగం, నెల్లూరు బ్యారేజ్‌ పూర్తి చేశామన్నారు.. దాదాపు 5 లక్షల ఎకరాల సాగు భూమి స్థిరీకరించామని తెలిపారు..నెల్లూరు బ్యారేజ్‌ ద్వారా 99,525 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని,,నెల్లూరు నగరంతో పాటు 77 గ్రామాలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని అన్నారు.,మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ వద్ద స్వర్గీయ వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిల కాంస్య విగ్రహాలను సీ.ఎం ఆవిష్కరించారు..

టీడీపీపై విరుచుకుని పడిన సీ.ఎం జగన్….

టీడీపీ హయాంలో మహుర్తాలు తప్ప పనుల్లేవు:- 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.30.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. సంగం బ్యారేజీని 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు. 2018 నాటికి పూర్తిచేస్తామని మరోసారి..2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకోసారి చెప్పారు..ఇలా మహుర్తాలు మీద మహుర్తాలు పెట్టుకుంటూ, మార్చుకుంటూ పోయారే తప్ప,, ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏరోజూ ఆలోచన చేయలేదని మండిపడ్డారు..టీడీపీ చేసిందల్లా ప్రాజెక్టులలో రేట్లు పెంచేయడం, ఎస్కలేషన్‌ ఇచ్చేయడం…ఆ తర్వాత కమిషన్లు దండుకోవడమే.చంద్రబాబు హయంలో ఇటువంటి అడుగులు చూశామన్నారు..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన్య క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు.

నెల్లూరు బ్యారేజీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 2.18 గంటలకు నెల్లూరు బ్యారేజ్ కు చేరుకొని నెల్లూరు బ్యారేజీ ని ప్రారంభించారు. జల పూజ చేసి, గంగమ్మ తల్లి కి సారే (పట్టు వస్త్రాలు) సమర్పించి,,నెల్లూరు బ్యారేజి పైలాన్ ను ఆవిష్కరించారు..బ్యారేజి ప్రాంతంలో ఏర్పాటుచేసిన మాజీ సీ.ఎం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం తిరిగి తాడేపల్లికి ప్రయాణం అయ్యారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

5 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

5 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

7 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

7 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.