INTERNATIONAL

7వ సారి మహిళల క్రికెట్ ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత జట్టు

అమరావతి: 7వ సారి కూడా మహిళల క్రికెట్ ఆసియా కప్ Twenty20ను భారత జట్టు కైవసం చేసుకుంది. శనివారం సిల్‌హట్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.66 పరుగుల లక్ష్యాన్ని 8.3 ఓవర్లలోనే ఆలవొకగా చేధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను, భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి, 65 పరుగులు సాధించింది. శ్రీలంక తరఫున ఇనోకా రణవీర అత్యధికంగా 18 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో రేణకా సింగ్ 3 వికెట్లు,,రాజేశ్వరి గైక్వాడ్,, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంను చేధించేందుకు బరిలోకి దిగిన, భారత్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించింది. స్మృతి మంధాన 25 బంతుల్లోనే 50 పరుగులు సాధించింది. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. భారత బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ (5), జెమీమీ రోడ్రిగెజ్ (2) పరుగులు సాధించి ఔటయ్యారు.ఈ సమయంలో బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్,,స్మృతి మంధానకు అండగా నిలిచింది.హర్మన్ ఈ మ్యాచ్ లో 11 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలవడంతో భారత మహిళల జట్టు ఆసియా కప్ కైవసం చేసుకుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 hour ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

4 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

4 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

6 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.