AMARAVATHI

గుంటలతో నిండిన రోడ్లను పూడ్చలేని ప్రభుత్వం రోడ్లను విస్తరిస్తుందా-పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాజంలో ఆశాంతికి కారణం అవుతున్న గుండాలను,రేపిస్టులను వదిలేసి, బాధితులను మాత్రం వేధిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.శనివారం గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేసిన బాధితులను పరామర్శించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ఇప్పటం గ్రామంలో రోడ్లు విస్తరించాలనే పేరుతో కొంతమంది ఇళ్లను కూల్చివేశారని,ఇందుకు  ప్రధాన కారణం,మార్చిలో జనసేన అవిర్భవ సభకు స్థలం ఇచ్చినవారిపై కక్ష్య సాధించేందుకు రోడ్డు విస్తరించాలనే కుంటిసాకుతో వైసీపీ నేతలు కక్ష కట్టి వారి ఇళ్లను కూల్చివేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇప్పటం గ్రామం ఏమన్నా కాకినాడా? లేదా రాజమహేంద్రవరంమా? రోడ్లు విస్తరించటానికి అంటూ నిలదీశారు. ఇలా ఇతర పార్టీలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, పాలన చేతకాకపోవడంతో,ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. గుంతలతో నిండిన రోడ్లకు మరమ్మత్తులు చేయాలేని, ఈ ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసి రోడ్లు విస్తరిస్తుందా? వల్లభాయ్ పటేల్,మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీల విగ్రహాలు కూల్చివేసి,రాజశేఖర్ రెడ్డి విగ్రహాంను మాత్రం వదిలివేయడం చూస్తుంటే,ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా ఆర్దమౌవుతుందన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడే వైసీపీ తమకు అధికారం శాశ్వతం అని అనుకుంటోందని,ప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్దతులను ప్రజలు గమనిస్తున్నరని,,వారు పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలంగా, వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇళ్లు కూల్చివేయటం వంటి దౌర్జాన్యాలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించిన పవన్ కల్యాణ్..మీరు ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తు ఇళ్లు కూల్చివేస్తుంటే మేం ఇడుపులపాయలో హైవే నిర్మిస్తాం అంటూ హెచ్చరించారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

12 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

13 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.