DEVOTIONAL

గ్రామదేవతలను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే-గరికపాటి నరసింహారావు

నెల్లూరు: దేశ ప్రజల శాంతి, సుఖ,  సంతోషాల కోసమై సాంస్కృతిక శాఖ ద్వారా దేశంలోని వివిధ దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.కార్తీక పౌర్ణమి సందర్బంగా సోమవారం సాయంత్రం నగరంలోని గణేష్ ఘాట్ లో కార్తీక దీపోత్సవ సమితి నేతృత్వంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సయోధ్యగా కలిసిమెలిసి ఉండడానికి అత్యంత అనువైన మార్గం ఆధ్యాత్మిక భావనయే నన్నారు.ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసమని, సంస్కృతి, సంస్కారం, సందేశం ఇమిడి ఉండే దీపం అర్ధాన్ని వివరించారు. ఉపవాస దీక్ష వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తూ ఆధ్యాత్మికo, ఆరోగ్యo మేళవించి చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది.ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ గ్రామ దేవతలతో మనకు బంధుత్వం ఉంటుందని,  అటువంటి గ్రామదేవతలను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనన్నారు. హిందూ సాంప్రదాయం వైజ్ఞానిక సాంప్రదాయమన్నారు. తొలుత నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద, ప్రవచనకర్త పద్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు ల సమక్షంలో స్వర్నాల చెరువులో గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రతేకంగా ఏర్పాటు చేసిన పడవలలో దాదాపు వంద మంది మత్స్యకారులు తో స్వర్నాల చెరువు కార్తీక దీపాలతో తళుకుళీనింది.  శివ నామ స్మరణ తో  గణేష్ ఘాట్ పరిసరాలు మార్మోగాయి.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

3 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

20 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

23 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.