AMARAVATHI

గ్రీన్ కార్డు అందుకోకుండానే,దాదాపు 4 లక్షల మంది భారతీయులు జీవితంను ముగిస్తారా ?

అమరావతి: అమెరికా జారీ చేసే గ్రీన్ కార్డు కోసం ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులు ఎదురుచూస్తుంటారు..గ్రీన్ కార్డు జారీలో జరుగుతున్న ఆలస్యం కారణంగా దాదాపు 4 లక్షల మంది భారతీయులు ఆ కార్డును అందుకోకుండానే జీవితంను ముగిస్తారని ఒక సర్వేలో తేలింది..అమెరికాకు చెందిన క్యాటో ఇన్స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక ప్రకారం వివరాలు ఇలా వున్నాయి..అమెరికా ఎంప్లాయిమెంట్ ఆఫీసు వద్ద గ్రీన్ కార్డు కోసం సుమారు 11 లక్షల మంది భారతీయుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని,,వారందరికీ ఇప్పట్లో గ్రీన్కార్డు అందడం అసాధ్యంగా కనిపిస్తోందని పేర్కొంది.. అమెరికా ఎంప్లామెంట్ శాఖ వద్ద మొత్తం 18 లక్షల గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని,అందులో 63 శాతం దారఖాస్తులు భారతీయులవే అని వెల్లడించింది..వీటికి తోడు ఫ్యామిలీ సిస్టమ్ తో లింకు ఉన్న గ్రీన్ కార్డులు సుమారు 83 లక్షల వరకు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది..కొత్తగా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులకు,,వెయిటింగ్ అనేది ఓ జీవితకాల శిక్షగా మారనున్నట్లు వెల్లడించింది..ప్రస్తుతం ఆ శాఖ వద్ద ఉన్న దరఖాస్తుల్ని క్లియర్ చేయాలంటే దాదాపు 134 ఏళ్లు పడుతుందన్నది.. దాదాపు 4,24,000 మంది గ్రీన్ కార్డు కోసం ఎదురూచూస్తూ జీవితంను ముగిస్తారని,, వీరిలో 90 శాతం మంది భారతీయులే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

13 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

16 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

17 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

18 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.