AMARAVATHI

రబీకి 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల

నెల్లూరు: జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్  దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం  నిర్వహించారు.అనంతరం పలువురు రైతు సంఘాల నాయకులు, రైతులు మాట్లాడుతూ రెండో పంటకు విత్తనాలను ఇబ్బందులు లేకుండా అందించాలని, టార్పాలిన్ పట్టాలను సబ్సిడీపై అందజేయాలని, పంట కాలువలకు  పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండో పంటకు పుష్కలంగా నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, రెండు రిజర్వాయర్లలో కూడా నీరు అందుబాటులో ఉందని చెప్పారు. రైతులందరూ తక్కువ నీటి వినియోగంతో పండే చిరుధాన్యాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని, రైతులందరూ కూడా చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఎక్కువగా వరి వేయకుండా చిరుధాన్యాలు, పత్తి, వేరుశనగ పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన వాకాటి నారాయణరెడ్డి పదవీ కాలం  ముగియడంతో ఆయనను మంత్రి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

 చివరిగా రైతులకు ఓదెలు (చిరుధాన్యాలు) విత్తనాలను మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాఖ రూపొందించిన వ్యవసాయ, అనుబంధ శాఖల నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక 2023-24 పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు,రైతు సంఘాల నాయకులు, రైతులు, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

3 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.