DISTRICTS

70 కోట్ల కుంభకోణం,అవినీతికి పాల్పడ్డ అధికారులపై విజిలెన్స్ విచారణ,సిబిఐకి లేఖ-అజీజ్

ఒక్క లే ఔట్ లో 70 కోట్ల కుంభకోణం…

నెల్లూరు: రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లిపురం వద్ద శ్రీ లక్ష్మీ భగవాన్ వెంకయ్య స్వామి స్మార్ట్ సిటీ పేరుతో వేస్తున్న లేఔట్ ను శనివారం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, తదితర టిడిపి నేతలతో కలిసి పరిశీలించారు..పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 23 ఎకరాల స్థలంలో లేఅవుట్ వేశారని, అయితే ఈ స్థలంలో జాఫర్ సాహెబ్ కాలువ లేబరు కాలువ గుడిపల్లిపాడు కాలువ మరొక కాలువ మొత్తం నాలుగు కాలువలు ప్రవాహిస్తాయని,నాలుగు కాలువలకు, ఒక డ్రైన్ కు  సంబంధించిన 4.5 ఎకరాల ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమించి లేఔట్ లో కలిపి రోడ్లు వేసేస్తున్నారని తెలిపారు..లేఔట్ లోకి రావడం కోసం ఇరిగేషన్ కాలువపై ఒక అనుమతిలేని బ్రిడ్జిని నిర్మించారని, పక్కనే వంద మీటర్ల దూరంలో మరో బ్రిడ్జి ఉందని, పక్కపక్కనే రెండు బ్రిడ్జి లకు అనుమతి ఇవ్వరని తెలిపారు.ఈ కాలువల కింద 40 నుంచి 50 వేల ఎకరాల ఆయకట్టు ఉందని, కాలువలలో డీసెల్టింగ్ చేయడానికి కూడా వీలు లేకుండా స్థలం లేకుండా చేసి స్మార్ట్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.వీళ్లకు ఉండే భూమి అంతా వీళ్ళు వేస్తున్న లేఅవుట్ ఎంత అని ప్రశ్నించారు. నుడా పరిమితులు లేకుండా పర్మిషన్లు లేకుండా ఎంతో అన్యాయంగా లే ఔట్ వేస్తున్నారని తెలిపారు..అంకణం ఒకటిన్నర లక్ష రూపాయలకు అమ్ముతున్నారని, పరిమితులు పాటించకుండా ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి 86 కోట్లకు అమ్మవలసిన స్థలాన్ని150 కోట్లకు అమ్ముతున్నారని కేవలం ఒక లేఅవుట్లో 70 కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నారని తెలిపారు..70 కోట్ల కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనీ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా ఇలాంటి కుంభ కారణాలు చేయడం కోసమేనా చుక్కల భూములను తొలగించింది అని ప్రశ్నించారు..నియమ నిబంధనలు పాటించకుండా లేఔట్ ను నిర్మిస్తున్నారని కలెక్టర్ కూడా ఇరిగేషన్ వారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అందరూ కుమ్మక్కైపోయారని విమర్శించారు..విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఐదు కోట్లు ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయని, రెండు రోజుల నుంచి మా ఫోన్లు ఎత్తకపోతే నిజమేనేమో అనిపిస్తుందని అన్నారు.. ఇంటి ముందు మట్టి వేస్తేనే వారిని రాత్రి పగలు నిద్రపోనివ్వకుండా ఫైన్లు వసూలు చేస్తారని అలాంటిది 22 ఎకరాల్లో నాలుగున్నర ఎకరా ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమిస్తుంటే అధికారులకు తెలియడం లేదా అని మండిపడ్డారు..

Spread the love
venkat seelam

Recent Posts

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

2 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

2 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

3 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

22 hours ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

1 day ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

1 day ago

This website uses cookies.