AMARAVATHI

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో…7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి…ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని…వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని…మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె డాక్ట‌ర్ సింధూర పొంగూరు తెలిపారు..ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా….ఆమె నెల్లూరు సిటీ 47వ డివిజ‌న్‌లో ప‌ర్య‌టించారు..
అనంత‌రం డాక్ట‌ర్ సింధూర పొంగూరు మీడియాతో మాట్లాడారు. ధ‌న‌వంతులైనా… పేద‌వాలైనా…. కోరుకునేది మూడే మూడు కోరిక‌ల‌ని…అవి మంచి ఇల్లు…స్వ‌చ్ఛ‌మైన నీరు, మంచి భోజ‌నం అని తెలిపారు. ప్ర‌తీ ఒక్క‌రికి ఈ మూడింటిని అందించాల‌న్న‌దే తెలుగుదేశం ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌న్నారు. అందుకు అనుగుణంగా టీడీపీ మేనిఫెస్టోను మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రూపొందించార‌ని చెప్పారు. అదే విధంగా నెల్లూరు ప్ర‌జ‌లంద‌రికి కూడా ఈ మూడింటిని అందించేందుకు మాజీ మంత్రి నారాయ‌ణ ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని గుర్తు చేశారు. ప్ర‌తీ పేద‌వాడికి సొంతిల్లు ఉండాల‌న్న ల‌క్ష్యంతో…45వేల టిడ్కో గృహాల‌ను హై టెక్నాల‌జీతో నిర్మించి…నిరుపేద‌లంద‌రికి కేటాయించారన్నారు. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం వాటిని ప్ర‌జ‌ల‌కి ఇవ్వ‌క‌పోగా…వాట‌న్నింటిని పాడుపెట్టేసిందని మండిప‌డ్డారు. నారాయ‌ణ అధికారంలోకి రాగానే… ఫ‌స్ట్ 45వేల ఇళ్ల‌ను నిరుపేద‌లంద‌రికి అంద‌చేయ‌డంతోపాటు… అవ‌స‌ర‌మైతే మ‌రో 45వేల ఇళ్ల‌ను కూడా నిరుపేద‌ల కోసం క‌ట్టిస్తామ‌ని కూడా నారాయ‌ణ ప్ర‌జ‌ల‌కి హామీ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోకి…వైసీపీ మేనిఫెస్టోకి చాలా తేడా ఉంద‌న్నారు. ఆ డిఫ‌రెంట్‌ని ప్ర‌జ‌లంద‌రూ తెలుసుకోవాల‌ని కోరారు. ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న భూముల్ని కాపాడుకునేందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని అధికారంలోకి ర‌ద్దు చేస్తామ‌ని చంద్ర‌బాబునాయుడు చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ అమూల్య‌మైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటేసి… నాన్న‌ని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్ర‌భాక‌రెడ్డిని ఎంపీగా ఆశీర్వ‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

4 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

22 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

1 day ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 day ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

This website uses cookies.