AMARAVATHI

సూర్యుడి బాహ్య రహస్యలను శోధించేందుకు ఆదిత్య-L1 ఒక ప్రయోగశాల వంటిది-ఇస్రో

అమరావతి: చంద్రయాన్-3 విజయంతో సూర్యుని బాహ్య రహస్యలను శోధించేందుకు ఆదిత్య-L1 మిషన్ ప్రయోగానికి ఇస్రో సర్వ సిద్దం చేసుకుంది..సెప్టెంబర్ 2న ఉదయం 11:50 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ ఆదిత్య-ఎల్1ను తీసుకెళ్లబోతోంది..ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదని,,భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధన సాగిస్తుందని సోషల్ మీడియా వేదిక ద్వారా ఇస్రో వెల్లడించింది.. సూర్యుడు, భూమి మధ్య దూరంలో ఇది కేవలం ఒక్క శాతం మాత్రమే అని తెలిపింది..సూర్యుడిపై పరిశోధన చేసేందుకు మొత్తం 7 పేలోడ్లతో ఆదిత్య-L1 నింగిలోకి ప్రయాణం సాగించనున్నది..వీటిలో 4 పేలోడ్స్ సూర్య కాంతిపై అధ్యయనం చేయనుండగా,, మిగిలిన 3 దగ్గరలో ఉండే అయస్కాంత క్షేత్రాలపై, సౌర రేణువులను పరిణామ క్రమంను శోధిస్తాయి..ఆదిత్య ఎల్-1 109 రోజులపాటు ప్రయాణించి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్లి సూర్యుడి రహస్యాలను మనకు తెలియజేస్తుంది..ఆదిత్య-L1 మిషన్ లో ప్రైమరీ పేలోడ్ అయిన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ రోజుకు 1,440 ఇమేజ్ లను గ్రౌండ్ స్టేషన్ కు పంపించనున్నది..ఇస్రో ఇప్పటి వరకూ చేపట్టిన మార్స్ ప్రయోగం కంటే ఆదిత్య-L1 మిషన్ అత్యంత క్లిష్టమైన ప్రయోగం..ఆదిత్య-L1 ఒక రకమైన అంతరిక్ష ప్రయోగశాల లాంటిది..ఇందులో టెలిస్కోపులు, మ్యాగ్నెటోమీటర్లు, స్పెక్ట్రోమీటర్లు, ప్లాస్మా ఎనలైజర్లు వంటి పరికరాలు ఉంటాయి..అవి
i. సోలార్ అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్: ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ నుంచి వెలువడే అతినీలలోహిత తరంగాలను ఇది గుర్తిస్తుంది..
II. విజబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్:- ఇది కొరోనాపై దృష్టి పెడుతుంది. కాంతితోపాటు, పరారుణ తరంగాలను గుర్తించి,,సూర్యుడి అయస్కాంతక్షేత్రం ఉష్ణోగ్రతను, సాంద్రతను, ఇతర మార్పులను లెక్కిస్తుంది.. III. సాఫ్ట్ అండ్ హార్డ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్స్:- సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్ రేలను ఇవి విశ్లేషిస్తాయి. అవి ఏ ప్రాంతం నుంచి వెలువడుతున్నాయో ఆ ప్రాంతం ఉష్ణోగ్రత ఇతర వివరాలను వీటి ద్వారా తెలుసుకోవచ్చు..
IV. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్:- ఎలకా్ట్రన్లు, ప్రోటాన్ల రూపంలో సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ ను సోలార్ విండ్స్ అంటారు..వీటిని ఈ పరికరం విశ్లేషిస్తుంది..V. ప్లాస్మా ఎనలైజర్:- సూర్యుడి నుంచి వెలువడే ప్లాస్మా వివరాలను తెలుపుతుంది..
VI. అడ్వాన్స్డ్ ట్రై యాక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటో మీటర్:- రేడియేషన్ తోపాటు వెలువడే అయస్కాంత తరంగాలను గుర్తించి విశ్లేషిస్తుంది..వీటన్నింటిని నుంచి వచ్చే సమాచారాన్నిఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సూర్యుడిలో కలుగుతున్న మార్పులను, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తారు..

 

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

21 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

21 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.