AMARAVATHI

వైసీపీ దెబ్బ‌కి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలంద‌రూ ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిపోయార‌ు-నారాయణ

నెల్లూరు: టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిరుపేద‌ల కోసం రూ. 2,260 కోట్ల‌తో అత్యాధునిక షేర్‌వాల్ టెక్నాల‌జీతో నెల్లూరు న‌గ‌రంలో 42వేల టిడ్కో గృహాల‌ను నిర్మించామ‌ని,,దాదాపు నిర్మాణాలు పూర్తి చేసి పేద‌ల‌కి తాళాలు ఇచ్చే స‌మ‌యంలో ఎన్నిక‌ల కోడ్ రావ‌డంతో వాటిని ఇవ్వ‌లేక‌పోయామ‌ని మాజీ మంత్రి నారాయ‌ణ అన్నారు..ఆదివారం న‌గ‌రం 3వ డివిజ‌న్ పరిధిలో వేణుగోపాల్ నగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఆ త‌రువాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్లు అయినా నిరుపేద‌ల‌కి ఇల్లు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.. టీడీపీ వాళ్లు నిర్మించారు కాబట్టి ఇప్పుడు ఇస్తే వాళ్ల‌కి ఎక్క‌డ పేరు వ‌స్తుందోన‌ని వైసీపీ ఆలోచ‌న చేయ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు.. రాజ‌కీయ‌మంటే ఇది కాద‌ని వైసీపీ నాయ‌కుల‌కి ఆయ‌న హిత‌వు ప‌లికారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త అని తెలిపారు.ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ప‌నులు ఫేజ్ వ‌న్ పూర్తయ్యాయ‌ని…టీడీపీ రాగానే వాటిని కూడా పూర్తి చేసి…నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కే జిల్లా వాసులంద‌రికి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని హామీ ఇచ్చారు. వైసీపీ నాయ‌కులు దెబ్బ‌కి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలంద‌రూ ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిపోయార‌న్నారు. దీంతో ప్ర‌భుత్వానికి ఆదాయం ప‌డిపోయింద‌న్నారు. ఎప్పుడైతే ప్ర‌భుత్వానికి ఆదాయం రాదో…డెవ‌ల‌ప్ మెంట్‌, సంక్షేమం రెండూ ఆగిపోతాయ‌న్నారు. అది చేయ‌లేక ప్ర‌జ‌ల మీద భారం మోపి…ట్యాక్స్ లు వేశార‌ని విమ‌ర్శించారు. ఎమ్మెల్యేగా తనను,,ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని నారాయ‌ణ ప్ర‌జ‌ల్ని కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

14 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.