AMARAVATHI

140 కోట్ల మందికి మోదీ కీ గ్యారంటీ రూపంలో హామీ ఇస్తున్నాం-ప్రధాని మోదీ

బీజేపీ మేనిఫెస్టో విడుదల..

అమరావతి: 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉచిత రేషన్ అందజేస్తామని.. వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేరుస్తామని,, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు..ఆదివారం ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తమ పాలన సమయంలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని,, మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు.. రానున్న రోజుల్లో పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు..పీఎం సూర్యఘర్‌ పథకానికి కోటి మంది రిజిస్టర్‌ చేసుకున్నారని,, ఇంట్లో తయారైన కరెంట్‌ను ప్రజలు విద్యుత్ సంస్థలకు అమ్ముకోవడానికి కూడా వీలుంటుందన్నారు..ఇప్పటి వరకు ముద్ర పథకం కింద కోట్లమందికి స్వయం ఉపాధి లభించిందని,,ముద్ర పథకం రుణ పరిమితిని రూ.20 లక్షలు చేస్తామన్నారు..చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని,,దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడడం జరిగిందన్నారు.. వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం పెంచడంతో పాటు మహిళలకు ఇప్పటికే డ్రోన వినియోగం శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.. శ్రీ వరి రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు ఉంటుందని అలాగే సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తామన్నారు..నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం.’ అని ప్రధాని మోదీ అన్నారు..

దేశంలో మూడు రకాల వందే భారత్‌ రైళ్లు:- బీజేపీ పాలనలో అభివృద్ధి,, సంస్కృతి రెండింటికీ సమ ప్రాధాన్యం ఉందని,, ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్‌ను మారుస్తామన్నారు..దేశంలో మూడు రకాల వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని,, వందే భారత్‌ స్లీపర్‌,,వందే భారత్‌ మెట్రో రైళ్లు,,బుల్లెట్‌ రైళ్లు అని తెలిపారు..ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు మార్గం పూర్తి కానుందని అలాగే ఉత్తర, దక్షిణ, తూర్పు వైపు కూడా బుల్లెట్‌ రైలు మార్గాలు వేస్తామని తెలిపారు..యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ తీసుకువస్తామని,,వన్ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తామన్నారు..యువశక్తి, నారీశక్తి, గరీబ్‌, కిసాన్‌ను దృష్టితోనే సంకల్ప్‌ పత్ర అన్నారు.. యువత ఆకాంక్షలను మా సంకల్ప్‌ పత్ర ప్రతిబింబిస్తోందని,, 140 కోట్ల మందికి మోదీ కీ గ్యారంటీ రూపంలో హామీ ఇస్తున్నాం.’ అని ప్రధాని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

16 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

17 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

18 hours ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

18 hours ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

2 days ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

2 days ago

This website uses cookies.