AMARAVATHI

కెనడాలో మరో ఖలిస్థానీ సునుభూతి పరుడు హత్య

అమరావతి: ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూన్ననేపధ్యంలో కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతి పరుడు హత్యకు గురయ్యాడు..కెనడాలోని విన్నిపెగ్ లో బుధవారం రాత్రి జరిగిన దాడిలో సుఖ్ దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే మృతి చెందినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి..ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు..ఈ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది..హత్యకు గురైన సుఖా దునెకే పంజాబ్ లోకి మోఘా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు..2017లో సుఖా దునెకే నకిలీ సర్టిఫికేట్లతో కెనడాకు పారిపోయినట్లు తెలుస్తోంది..
కెనడాలో గ్యాంగ్ స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరి ఖలీస్థానీ ఉద్యమంలో సుఖ్ దోల్ కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం..హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్, కెనడాల మధ్య వివాదం మొదలైన నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనించ తగిన ఆంశం..ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత నిజ్జర్ ఈ సంవత్సరం జూన్ లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారలో దుండగులు అతడిని కాల్చి చంపారు..ఈ విషయంపై కెనడా ప్రధాని ట్రూడో,వారి పార్లమెంట్ లో మాట్లాడుతూ,,ఈ హత్య భారత్ కు చెందిన అధికారులు చేయించినట్లు అనుమానం వుందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు..ఈ వ్యాఖ్యల అనంతరం భారత్, కెనడాల మధ్య వివాదం రోజురోజుకు ముదురతోంది..ఈ నేపథ్యంలో కెనడా విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.. భారత్ కు వచ్చే కెనడా పౌరులకు వీసాలు మంజూరు చేయరాదని భారత్ నిర్ణయించింది.. నిర్వహణపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడాలోని భారత హైకమిషన్ ప్రకటించింది..ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది..ఇదే సమయంలో కెనడా వ్యవహారాన్ని చర్చించేందుకు ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు..

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

3 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

3 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

5 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.