HYDERABAD

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా-సీ.ఎం కేసిఆర్

హైదరాబాద్: నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని,,ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు..శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలే అని విమర్శించారు..కేంద్ర తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని అన్నారు..ప్రస్తుతం భారతదేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉందని కేసీఆర్ అన్నారు..రూపాయి విలువ పడిపోయిందని, నిరుద్యోగ రేటు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు..మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనికి కేంద్ర విధానాలే కారణం అని విమర్శించారు..ఇలాంటి ముఖ్యమైన అంశాలపై నీతి ఆయోగ్‌లో చర్చించడం లేదని విమర్శించారు..కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై చర్చ లేదని, కేంద్రం నిస్తేజంగా చూస్తూ ఉండిపోతోందని మండిపడ్డారు..

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

19 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

19 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.