DEVOTIONAL

అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు-టిటిడి

తిరుమల: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలియచేసింది. అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సూర్యగ్రహణం రోజున ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు దాదాపు 12 గంటలు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదన్నారు. న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించారు. అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజుల్లో శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను కూడా టిటిడి రద్దు చేసింది.భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

4 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

12 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

1 day ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

This website uses cookies.