DISTRICTS

V.R.Law collegeలో లెక్చరర్ పై మాజీ విద్యార్ది దాడి

నెల్లూరు: గత కొన్ని సంవత్సరాల నుంచి V.R.Law collegeలో టన్నుల కొద్ది అవకతవకలు జరుగుతున్నాయి  అనే ఆరోపణలు వున్నాయి.ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖాలలు లేవు. ఈ నేపధ్యంలో..గురువారం V.R.Law collegeలో లెక్చరర్ పై మాజీ విద్యార్ది దాడి చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్లితే… శ్యాంసుందరం అనే లా కళాశాల మాజీ విద్యార్ది,అటెండెన్స్ సర్టిఫికేట్ గురించి దౌర్జన్యం మాట్లడడం జరిగిందని,ఈ విషయంను ఖండించినందుకు తనపై భౌతికంగా దాడి చేశాడని లా కాలేజ్ లెక్చరర్ నారాయణ చెప్పారు.నేడు అయన లా కాలేజ్ ఆవరణంలో నిరసన దీక్షకు చేపట్టాడు.ఈ సందర్బంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లా కాలేజ్ లోని కొంత మంది లెక్చరర్స్,ఇలాంటి మాజీ విద్యార్దులకు వంతం పాడుతున్నరని,కాలేజ్ లోని మరొక లెక్చరర్,,,ఒక ప్రవేట్ కాలేజ్ కి సంబంధించిన విద్యార్దులతో కొంత మొత్తం నగదు అయనకు చెల్లించే విధంగా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. సదరు కాలేజ్ కి సంబంధించిన విద్యార్దులకు, పరీక్ష కేంద్రంగా లా కాలేజ్ ని కేటాయించినప్పడు,ఒప్పందం కుదుర్చుకున్న లెక్చరర్,ప్రవేట్ కాలేజ్ విద్యార్దులు మాస్ కాపీయింగ్ చేసుకునేందుకు సహకరిస్తారని ఆరోపించారు.ఇలాంటి సంఘటనలను తాను నిలదీయడంతో, భరించ తనకు జరిగిన ఆన్యాయంపై జాయింట్ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు.ఇందుకు జె.సి వెంటనే స్పందించారని తెలిపారు.తనపై దాడి చేసేందుకు ప్రొత్సహించిన డా.ఎన్.రవి,,డా.రామాంజనేయులు,దాడి చేసిన శ్యాంపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు నిరహారదీక్ష చేస్తానని తెలిపారు.మరి అధికారులు ఎలా స్పందిస్తారొ,వేచి చూడాల్సిందే..

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

9 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

10 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.