DISTRICTS

పేదలకు అత్యాధునిక వైద్య సేవలే లక్ష్యం- ఎమ్మేల్యే అనిల్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని పేద ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా “పట్టణ ఆరోగ్య కేంద్రాల” నిర్మాణం జరుగుతోందని సిటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ వెల్లడించారు. స్థానిక 44వ డివిజన్ కలెక్టరేట్  సమీపంలో నూతనంగా నగర పాలక సంస్థ నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని కొన్ని వ్యాధులను సైతం పధకంలో చేర్చి పేదలందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందజేసి ప్రజలపై ఆర్ధిక భారం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వయో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులు స్థానిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అనుభవజ్ఞులైన వైద్యులతో వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కను నాటి సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ హరిత, DM&HO డాక్టర్ పెంచలయ్య, MHO డాక్టర్ వెంకటరమణ,Dy మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు నీలి రాఘవ రావు, పోట్లూరి రామకృష్ణ, ముదిరెడ్డి వేదవతమ్మ, షేక్ సఫియా బేగం, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ చంద్రయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

8 mins ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

49 mins ago

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

22 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

24 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

1 day ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

1 day ago

This website uses cookies.