BUSINESS

మార్కెట్ లో పెరుగుతున్న నకిలీ రూ.500 నోట్లు-ఆర్బీఐ నివేదిక

అమరావతి: మార్కెట్ సర్కూలేట్ అవుతున్న నకిలీ రూ.500 నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ కీలక ప్రకటన విడుదల చేసింది..మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500 నోట్లే ఎక్కువగా వున్నాయని తెలిపింది..గత సంవత్సరం పోలిస్తే నకిలీ రూ.500నోట్ల సంఖ్య 14.4శాతం పెరిగిందని, ఇప్పటివరకు 91,110 నకిలీ నోట్లను గుర్తించినట్టు వెల్లడించింది..(నేడు) మే 30న వార్షిక నివేదిక విడుదల చేసిన RBI 2022-23 సంవత్సరానికి గానూ వివరాలను ప్రకటించింది..గత ఏడాదితో పోలిస్తే రూ.20 నకిలీ నోట్లు 8.4 శాతం పెరిగాయని పేర్కొంది.. రూ.10, 100, 2వేల డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు 11.6 శాతం తగ్గాయని వెల్లడించింది..కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు కూడా తగ్గినట్టు RBI ప్రకటించింది.. 2021-22 సంవత్సరంలో కరెన్సీ నోట్లు ముద్రించడానికి రూ.4, 984.80 కోట్లు ఖర్చు కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4, 682.80 కోట్లు ఖర్చయిందని పేర్కొంది..మార్కెట్లో రూ.500 నకిలీ నోట్ల సంఖ్య భారీగా పెరిగిందని,,ఒరిజినల్ రూ.500 నోట్లను గుర్తించేందుకు RBI కొన్ని గుర్తులను సూచించింది..
కరెన్సీ నోటు ముందు వైపు ఎడమవైపు అడ్డంగా 500 నెంబర్ కనిపిస్తుంది…రెండో గుర్తు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది…కరెన్సీ నోటు మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది…మహాత్మాగాంధీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్ లో ఇండియా అనే పదాలు కనిపిస్తాయి…మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, RBI, 500 అని కనిపిస్తాయి…సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం,,సంతకం కింద ఆర్బీఐ ఎంబ్లమ్ ఉంటుంది…రూ.500 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది…ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది…ప్రతీ నోటుకు వేర్వేరు నెంబర్లు ఉంటాయి…ఒకే నెంబర్ తో రెండు నోట్లు ఉండవు…రూ.500 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం ఉంటుంది… అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి…ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి… తెల్లని స్పేస్ కింద స్వచ్ఛ్ భారత్ లోగో, నినాదం ఉంటాయి…లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది… ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

3 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

3 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

9 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

1 day ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

This website uses cookies.