NATIONAL

అదుపు తప్పిన బస్సు- ఘోర ప్రమాదంలో 10 మంది మృతి

వైష్ణో దేవికి ఆలయంకు…

అమరావతి: జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది..జమ్ములో జిల్లాలో జజ్జర్ కోట్లీ ప్రాంతంలో వంతెనపై నుంచి వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది..సంఘటనలో స్థలంలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..57 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.. ప్రయాణికులంతా మాతా వైష్ణో దేవికి ఆలయంకు వెళ్తున్న ట్లు సమాచారం..వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులు కత్రా ప్రాంతం బేస్ క్యాంప్ ద్వారా  ప్రయాణిస్తుంటారు..ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి,పోలీసులకు సమాచారం ఇవ్వడంతో,, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టినట్టు జమ్ము ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు..గాయపడిన వారిని జమ్ము ఆసుపత్రికి తరలించి,,చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఉన్నరని,,ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు..మరోవైపు సహాయ చర్యల కోసం NDRF,,CRPF బలగాలు సైతం రంగంలోకి దిగాయి..బస్సు అమృతసర్ నుంచి వస్తున్నట్లు సమాచారం వున్నదని,,బస్సులో బీహార్కు చెందిన వారు ఉన్నారని తెలిపారు..బస్సు కత్రా బేస్ క్యాంప్ కు వెళ్లే మార్గంలో,,దారి తప్పినట్లుగా గుర్తించడం జరిగిందని CRPF అసిస్టెంట్ కమాండెంట్ ఆశోక్ చౌదరి తెలిపారు..బస్సు ప్రమాదంలో బీహార్ కు చెందిన వారు మరణించినట్లు సమాచారం అందడంతో,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు..బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందచేస్తామని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

7 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

23 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

2 days ago

This website uses cookies.