AMARAVATHI

ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు రక్షణ ఉందా ? పవన్ కళ్యాణ్

అమరావతి: వైసీపీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో నివాసనికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు..ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? సీఎం నివాసం దగ్గరలో ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ఆయన ప్రశ్నించారు..తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డగా మారిందని ఆరోపించారు..గతంలో జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇంకా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తన నివాసం పరిసరాల పరిస్థితులనే సమీక్షకుంటే ఎలా? అని పవన్ ప్రశ్నించారు..మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనన్నారు..కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..దారుణ ఘటనలపై అన్ని వర్గాలూ ఆలోచన చేయాలని సూచించారు..తల్లి పెంపకంలోనే లోపం ఉందనే మంత్రులు గల ప్రభుత్వమిదని విమర్శించారు..దొంగతనానికి వచ్చి రేప్ చేశారనే మంత్రులు గల ప్రభుత్వమిదని విరుచుకుపడ్డారు.. అఘాయిత్యాలు సాగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోంది? అని పవన్ ప్రశ్నించారు..గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారని పేర్కొన్నారు..

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో దారుణం జరిగింది..మద్యం మత్తులో అంధురాలైన ఓ యువతిని ఓ కిరాతకుడు అతి దారుణంగా నరికివేశాడు..ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అదే ప్రాంతానికి చెందిన రాజు అనే దుండగుడు కత్తితో దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు..తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతానికి చెందిన కుక్కుల రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో ఆదివారం రాత్రి ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు..ఈ విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది..దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు కలిసి రాజును మందలించడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు..ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై కత్తితో దాడి చేసి నరికివేశాడు..నేరుగా రాజు,,డీఎస్పీ వద్దకు వెళ్లి లొంగిపోయాడు..రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది…శాంత్రిభద్రతల వైఫల్యం ఆడ,బిడ్డలపై అఘాయిత్యాలపై మహిళ సంఘాలు,మేధావులు,,న్యాయ నిపుణులు గళమెత్తాలి..

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

3 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

20 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

23 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.