DISTRICTS

ముందస్తు జాగ్రత్తలతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా నివారించాం-కలెక్టర్

నెల్లూరు:  మాండుస్ తుఫాను నేపథ్యంలో జిల్లాలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణనష్టం లేకుండా నివారించగలిగామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ నెల్లూరు బ్యారేజి ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీటి ప్రవాహన్ని పరిశీలించారు.తెలుగుగంగ ప్రాజెక్టు C.E హరినారాయణరెడ్డి సోమశిల ప్రాజెక్టు, సంగం బ్యారేజిల ద్వారా విడుదలైన వరద నీటి ప్రవాహన్ని గురించి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాండుస్ తుఫాను ప్రభావంతో జిల్లాలోని 38 మండలాల్లో సగటున 18 సెంమీల వర్షపాతం నమోదయిందని తెలిపారు. అత్యధికంగా మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో 28 సెంమీల వర్షపాతం, అత్యల్పంగా కలిగిరి మండలంలో 7 సెంమీల వర్షపాతం నమోదయిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు వరద నీటి ప్రవాహన్ని అంచనా వేస్తూ, ఇతర శాఖల సమన్వయంతో ధీటుగా ఎదుర్కొన్నామన్నారు. అదేవిధంగా NDFR, 2 బృందాలు,,SDRF నుంచి ఒక బృందం సహాయంతో రిస్క్యు ఆపరేషన్స్ నిర్వహించామన్నారు. దాదాపు 2800 మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించి అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. వర్ష ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని, రాబోయే రెండు రోజులు మత్స్యకారులు సముద్రం లోకి వెళ్ళవద్దని సూచిస్తూ, 12 తేదీ అర్ధరాత్రి వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.సోమశిల ప్రాజెక్టు నుండి 38 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేయడం జరిగిందని, వరద ఉదృతిని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. భారీ వర్షాలతో జిల్లాలో మంచి వర్షపాతం నమోదయి, జిల్లాలోని 780 చెరువులు నిండాయని, రాబోయే వ్యవసాయ సీజన్ కు పుష్కలంగా నీరు లభించిందన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నెల్లూరు DRO మలాల్, ఇరిగేషన్ SE కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

5 mins ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

40 mins ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

57 mins ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

21 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

24 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

1 day ago

This website uses cookies.