AMARAVATHI

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదే,24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్-అమిత్ షా

అమరావతి: జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ), జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులను లోక్ సభలో ఆమోదం కోసం ప్రవేశ పెట్టడడం జరిగిందని అమిత్ షా వెల్లడించారు..బుధవారం జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్ సభలో సుధీర్ఘమైన చర్చ జరిగింది.. లోక్ సభలో జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్ బిల్లుల్ని ప్రవేశపెట్టిన సందర్బంగా హోం మంత్రి మాట్లాడుతూ ఈ బిల్లు ప్రకారం కశ్మీర్ లో 47, జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.. పీఓకేలో 24 సీట్లను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది..గతం కంటే కశ్మీర్ లో అదనంగా ఒకటి, జమ్మూలో ఏడు సీట్లను పెంచింది.. కొత్త కోటా ప్రకారం పండిట్లకు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది..పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదేని లోక్ సభలో అమిత్ షా స్పష్టం చేశారు..చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిల్లు లక్ష్యాలపై అందరూ ఏకీభవిస్తున్నారని,,ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ బిల్లు అని అన్నారు.. తాను తీసుకొచ్చిన బిల్లు 70 సంవత్సరాలుగా అన్యాయానికి గురైన, అవమానించిన, వారి గురించి పట్టించుకోని బాధితులకు న్యాయం చేసే బిల్లు అంటూ వ్యాఖ్యానించారు..ఈ బిల్లు గత 70 ఏళ్లలో అన్యాయానికి గురైన వారిని ముందుకు తీసుకెళ్లే బిల్లు అంటూ కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డారు..ఈ బిల్లు సొంత దేశంలో నిర్వాసితులైన వారికి గౌరవం, నాయకత్వం అందిస్తుందన్నారు..ఈ బిల్లును ఎవరూ వ్యతిరేకించనందుకు సంతోషంగా ఉందన్నారు..
‘రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ తీవ్రంగా నష్టపోయిందన్నారు..మొదటిది.. పాక్ తో యుద్ధంలో మన సైన్యం గెలుస్తున్నప్పుడు ‘కాల్పుల విరమణ’ విధించడం.. ఒకవేళ మరో మూడు రోజుల పాటు ఆ యుద్ధాన్ని కొనసాగించి, ఆ తర్వాత సీజ్ ఫైర్ కి పిలుపునిచ్చి ఉంటే,, పీఓకే మన దేశంలో భాగమై ఉండేది.. ఇక రెండోది.. మన అంతర్గత సమస్యను ఐక్యరాజ్యసమితి (UN) దృష్టికి తీసుకెళ్లడం’’ అని అమిత్ షా అన్నారు.. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద సంఘటనలు చోటు చేసుకోకుండా చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోందని, 2026 నాటికల్లా ఆ విషయంలో విజయం సాధిస్తామని చెప్పారు.
నిర్వాసిత కశ్మీరీ పండిట్లకు రిజర్వేషన్లు ఇస్తే ఏమవుతుందని అడిగే వారు ఆలోచించాలన్నారు.. కాశ్మీరీ పండిట్లకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి గొంతు కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తుందన్నారు..ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ అమిత్ షా పేర్కొన్నారు.. 2019 ఆగస్టు 5-6 తేదీలలో, సంవత్సరాల తరబడి వినిపించని వారి గొంతులను మోడీ జీ వినిపించారని,, నేడు వారు వారి హక్కులను పొందుతున్నారన్నారు.. కాశ్మీరీలు నిర్వాసితులైనప్పుడు, వారు తమ దేశంలోనే శరణార్థులుగా మారవలసి వచ్చిందని తెలిపారు.. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన నరేంద్ర మోదీ దేశానికి నాయకుడని,,వెనుకబడిన వర్గాల బాధలు, పేదల బాధలు కూడా ఆయనకు తెలుసంటూ అమిత్ షా పేర్కొన్నారు..ఈ బిల్లు ద్వారా ఉగ్రవాదం వల్ల తీవ్ర విషాదాన్ని చవిచూసిన ప్రజలకు బలం చేకూరుతుంది. ఉగ్రవాదం కారణంగా 46,631 కుటుంబాలు, 15,7967 మంది తమ నగరాలను విడిచిపెట్టి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారని అమిత్ షా వెల్లడించారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

17 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

17 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

20 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

20 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

20 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

21 hours ago

This website uses cookies.