BUSINESS

చైనాలో 40 వేల థియేటర్‌లలో విడుదల కానున్న రామ్‌గోపాల్‌ వర్మ చిత్రం లడ్‌కీ

రెండు దశాబ్ధాల కల ఇది..
హైదరాబాద్: దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అంటేనే, వివాదాలు,కట్టె విరిచిపెట్టినట్లుగా వుండే ట్వీట్లు..అలాంటి వర్మదర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “లడ్‌కీ” మార్షల్‌ ఆర్ట్స్‌ ను కథాశంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో “అమ్మాయిగా”విడుదల చేయనున్నారు..ఈ చిత్రంను తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు చైనాలోనూ విడుదలకు సిద్దం చేస్తున్నారు.. చైనీస్‌లో “గర్ల్‌ డ్రాగన్‌” పేరుతో దాదాపు 40000 థియేటర్‌లలో విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన నిర్మాణ సంస్థ ARTSEE MEDIA and Chinese company BIG PEOPLE సంస్థతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 15వ తేదిన విడుదల కానుంది.. చైనాలో దంగల్‌ 9000,,సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ 12000,,బాహుబలి 6000 చిత్రాలు థియేటర్‌లలో విడుదల కాగా, “లడ్‌కీ” చిత్రం మాత్రం 40000 థియేటర్‌లలో విడుదల కానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి.. భారతదేశ చలన చిత్రరంగం చరిత్రలోనే ఈ స్థాయిలో చైనాలో విడుదల చేయడం తొలిసారి..ఈ చిత్రంలో కథానాయికీగా నటించిన “పూజా బాలేకర్‌ టైక్వాండో నేషనల్‌ ఛాంపియన్‌”..అయినప్పటికీ ఈ చిత్రంలో కథాశంకు అవసరం కావడంతో, చైనాలోని షావోలిన్‌ టెంపుల్‌లో శిక్షణ పొందిన నిపుణుల పర్యవేక్షణలో బ్రూస్‌లీ స్టైల్‌ అయినటువంటి “జీత్‌ కునేడో”లో శిక్షణ పొందింది..బ్రూస్‌లీ పట్ల నాకున్న అభిమానంతో తీసిన చిత్రమిది. రెండు దశాబ్ధాల కల ఇది’’ అని ఆర్‌జీవీ ట్వీట్‌ చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

11 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

11 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.