DEVOTIONAL

తుది శ్వాస విడిచిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి

అమరావతి: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సుదీర్ఘకాలం కృషి చేసిన స్వామి స్వరూపానంద సరస్వతి(99)  అస్వస్థతతో ఆదివారంనాడు పరమపదించారు.. స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని శ్రీథామ్ జోతేశ్వర్ అశ్రమ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని దిఘోరీ గ్రామంలో 1924 సెప్టంబరు 2వ తేదిన జన్మించిన శంకరాచార్య స్వామి 2018లో బృందావనంలో, పరమేశ్వరుడు పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకొనే హరియాలి తీజ్ రోజున ఆయన తన 99వ పుట్టినరోజు జరుపుకొన్నారు..సియోని జిల్లా జబల్‌పూర్ సమీపంలోని డిఘోరి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శంకరాచార్య, 9వ సంవత్సరంలోనే ఇంటిని విడిచిపెట్టి,,హిందూమత ఉద్ధరణ కోసం జీవితంను అంకితం చేశారు..యూపీలోని వారణాసి చేరుకుని స్వామి కర్పత్రి మహరాజ్ వద్ద వేదాలు అభ్యసించారు.. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు..19 సంవత్సరాల వయస్సులో స్వాతంత్య్ర పోరాటంలో దూకిన విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు..1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు.ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సంతాపం వ్యక్తం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

11 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

11 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.