AMARAVATHI

జనసేన కార్యకర్తలకు అందుబాటులో జనసేనాని,మంగళగిరికి షిఫ్ట్..

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో సమాయుత్తం చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు..రాష్ట్ర ప్రజలకు అన్ని వేళల అందుబాటులో వుండే విధంగా హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలను తాత్కలికంగా నిలిపివేసినట్లు సమాచారం..జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చేశారు..కేంద్ర కార్యాలయం సిబ్బంది,, ఫైల్స్,,ఇతర విభాగాలు,,కంప్యూటర్ లు మంగళగిరి కార్యాలయంకు తీసుకుని వచ్చారు..ఇక నుంచి సినిమా షూటింగ్ ఉంటేనే హైదరాబాద్ కు వెళ్లనున్నట్లు తెలిసింది..
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం జరిగింది.. సినిమాకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు కూడా నిర్మాతలు,, దర్శకులు మంగళగిరి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..ఆదివారం రాత్రి నుంచే జనసేనాని కార్యచరణలోకి దిగిపోయారు..గత రెండు రోజుల నుంచి పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మూడో విడత వారాహి యాత్రపై పార్టీ నేతలతో చర్చలు నిర్వహించినట్లు సమాచారం.. తూర్పు, పశ్చిమ గోదావరి,శ్రీకాకుళం,,విజయనగరం తదితర జిల్లాల నేతలను జనసేనాని మంగళగిరికి పిలిపించి మాట్లాడుతున్నట్లు భోగట్టా..

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

3 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

18 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

24 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.