HYDERABAD

ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రత్యేక చర్యలు-అమిత్ షా

సేంద్రీయ వ్యవసాయంపై..

హైదరాబాద్: రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకపోవడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు..ఆదివారం బేగంపేటలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదర్శ రైతులతో సమావేశమయ్యారు..వివిధ జిల్లాలకు చెందిన 17 మంది ఆదర్శ రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మరికొందరు కిసాన్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో సేంద్రీయ వ్యవసాయంవల్ల కలిగే ప్రయోజనాలతోపాటు ఫసల్ బీమా అమలు పథకంపైనా చర్చించారు..ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణలో ఫసల్ బీమా యోజనను అమలు చేయడం లేదని అమిత్ షా దృష్టికి తీకుని వచ్చారు..ఆకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లుతున్నా తమకు పరిహారం అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు..తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ తనకు గతంలో 10 ఎకరాల భూమి ఉండగా, వ్యవసాయంవల్ల తీవ్రంగా నష్టాలు వచ్చాయన్నారు..దీంతో కొంత భూమిని అమ్మేసి సేంద్రీయ వ్యవసాయం ఆరంభించమని,, సేంద్రీయ వ్యవసాయంతో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు..

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందని,,తాను కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు.గతంలో తనకున్న 20 ఎకరాల్లో తెలీకుండా రసాయన ఎరువులు  వాడటంతో పంట దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నారు. తనవద్ద దగ్గర మేలు జాతి (ఇక్కీస్) గోవులున్నాయని, అందులో ఒకటి ఒక గోమాత 12వ జనరేషన్ కు చెందినదని తెలిపారు.. గోమాత పేడను సేంద్రీయ ఎరువులుగా వాడటంవల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో వెనుకబడి ఉన్నామంటూ కొందరు రైతులు అమిత్ షా దృష్టికి తీసుకురాగా,అతి త్వరలోనూ అమూల్ సంస్థ ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్ లో తగిన ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో 5 సేంద్రీయ వ్యవసాయ లాబోరేటరీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తులపై పరీక్షలు చేయడంతోపాటు సేంద్రీయ ఉత్పత్తులు పండించే భూముల్లో ఏటా రెండుసార్లు భూసార పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

34 mins ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

20 hours ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

1 day ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

1 day ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

2 days ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

2 days ago

This website uses cookies.