CRIME

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో అరెస్ట్

అమరావతి: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక, T20 వరల్డ్ కప్ 2022 ఆడటానికి వెళ్లి ఓ మహిళపై ఆఘాయిత్యానికి పాల్పపడ్డాడు అనే ఫిర్యాదుపై ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయ్యాడు.T20 వరల్డ్ కప్ 2022లో కోసం ప్రకటించిన శ్రీలంక జట్టుకు ధనుష్క గుణతిలక ఎంపియ్యాడు. గ్రూప్స్ దశ మ్యాచ్‌ ఆడుతూ గాయపడడంతో, హ్యామ్‌ స్ట్రింగ్ గాయం వల్ల అతను సూపర్ 12 మ్యాచ్‌లల్లో పాల్గొనలేక పోయాడు. దీంతో లంక క్రికెట్ బోర్డు,గుణతిలక స్థానంలో మరో ప్లేయర్‌‌ను T20 వరల్డ్ కప్ కోసం పంపించింది.అయితే గుణతిలకను మాత్రం వెనక్కి పిలిపించలేదు. ప్రస్తుతం గుణతిలక శ్రీలంక జట్టుతో పాటే ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఈ నేపధ్యంలో సిడ్నీ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ పరిధిలోని ఓ హోటల్‌లో అతను బస చేస్తున్నాడు. ధనుష్క గుణతిలకకు ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ లో పరిచయమైన (29) మహిళ పరిచయం అయింది.ఈ నెల 2వ తేదిన న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ హోటల్‌లో ఆమెను కలిశాడు. ఈ సమయంలో గుణతిలక తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన  పోలీసులు,ధనుష్క గుణతిలకను సస్సెక్స్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేసి, సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

       ధనుష్క గుణతిలక అరెస్ట్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది.అలాగే గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేసింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. గుణతిలక పేరును ఎలాంటి సెలెక్షన్స్‌కు కూడా పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించింది. అఘాయిత్యం కేసులో గుణతిలక దోషిగా రుజువైతే అతనికి భారీ జరిమానా విధిస్తామని  శ్రీలంక క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. సర్రీ హిల్స్ జైలు నుంచి డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో వీడియో లింక్ ద్వారా వర్చువల్ విధానంలో గుణతిలక విచారణకు హాజరయ్యాడు. అతని తరఫు న్యాయవాది ఆనంద అమర్‌నాథ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.

(2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన ధనుష్క ఇప్పటివరకు 8 test,ODI 47, 46 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అయితే ఆటతో పాటే వివాదాలతోనూ వార్తల్లో కెక్కడు.2018లో గుణతిలక్ తన ఫ్రెండ్‌తో కలిసి ఓ నార్వేయన్ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు అతనిపై 6 మ్యాచ్‌ల సస్పెన్షన్‌ విధించింది.) 

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

4 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

12 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

1 day ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

This website uses cookies.