AMARAVATHI

రాహుల్ గాంధీకి రెండేళ్ల  జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

అమరావతి: 2019లో ప్రధాన మంత్రి “మోడీ” ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయుకుడు రాహుల్ గాంధీకి, గుజరాత్ లోని సూరత్ కోర్టు నేడు రెండేళ్ల  జైలు శిక్ష విధించింది..పరువు నష్టం కేసులో IPC సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది..2019 సాధారణ ఎన్నికల సందర్బంగా కర్నాటకలోని కోలార్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా, దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు..ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే,, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీ సూరత్ కోర్టులో కేసు వేశారు..రెండు సంవత్సరాల విచారణ అనంతరం వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది..దింతో గురువారం (మార్చి 23వ తేదీ) సూరత్ కోర్టులో రాహుల్ గాంధీ హాజరయ్యారు..ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని,,సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు,,రాహుల్ గాంధీకి u/s 499, 500  IPC  కింద రెండేళ్ల జైలు శిక్ష విధించింది..జైలు శిక్ష తీర్పు సమయంలో కోర్టులోనే ఉన్న రాహుల్ గాంధీ,,కోర్టు శిక్ష విధించడంతో షాక్ అయ్యారు..ఇదే సమయంలో సూరత్ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది..శిక్షకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అప్పీల్ మేరకు కోర్టు అతనికి 30 రోజుల బెయిల్‌ ను మంజూరు చేసింది..అప్పటి వరకు ఈ శిక్షను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

7 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

8 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

12 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

13 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

14 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.