HEALTH

జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను విడుదల చేసిన కేంద్రం

అమరావతి: జాతీయ అత్యవసర ఔషధాల జాబితా (NLEM 2022)ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం విడుదల చేశారు..కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలు ఉన్నాయి..ఈ జాబితలో ఐవర్‌మెక్టిన్‌ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు..రనిటైడిన్‌ సహా 26 ఔషధాలను అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించారు.. ప్రముఖ యాంటాసిడ్‌ అయిన రనిటైడిన్‌ను తొలగించడంతో ఇకపై జిన్‌టాక్‌, రాంటాక్‌ వంటి ట్యాబ్లెట్లు అత్యవసర మందుల విభాగంలోకి ఉండవు..మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉన్నట్లు చెప్పారు..ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్‌ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు..ఎండోక్రైన్‌ మందులు, ఇన్సులిన్‌ గ్లార్గిన్‌, ఐవర్‌మెక్టిన్‌ వంటి 34 రకాల ఔషధాలను కొత్త జాబితాలో చేర్చారు..రనిటైడిన్‌, సక్రాల్‌ఫేట్‌, అటినోలాల్‌ వంటి 26 రకాల ఔషధాలను తొలగించారు..2015 తర్వాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను సవరించడం ఇదే..350 మందికి పైగా వైద్య నిపుణులతో 140 సార్లు చర్చలు జరిపి ఈ జాబితాను తయారు చేసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు..రనిటైడిన్‌ ఔషధాన్ని దేశంలో అసిలాక్‌, జిన్‌టాక్‌, రాంటాక్‌ వంటి బ్రాండ్లతో అమ్ముతున్నారు.. ఎసిడిటీ, కడుపునొప్పి సంబంధిత సమస్యలకు డాక్టర్లు ఈ మందులను ఎక్కువగా సూచిస్తుంటారు..మెడిసిన్ ధరలపై నేషనల్ ఫార్మసూటికల్స్ ప్రైసింగ్ ఆథారిటీ (NPPA) నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

21 mins ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

4 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

4 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

4 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.