AMARAVATHI

ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రంప్రభుత్వం

అమరావతి: వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్రంప్రభుత్వం నిషేధం విధించింది.. దేశప్రజలకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది..ఉల్లిపాయల ఎగుమతులను వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు నిషేదిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఓ ప్రకటనలో పేర్కొంది..శుక్రవారం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా విదేశాలకు ఉల్లి ఎగుమతులు అనుమతిస్తున్నట్లు DGFT తెలిపింది..ఇందులో కొన్ని మినహాయింపులు కల్పిస్తూ,, ఈ నోటిఫికేషన్ కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని అలాగే ఇప్పటికే కస్టమ్స్ కు అప్పగించిన ఉల్లిపాయల సరుకును ఎగుమతి చేసుకోవచ్చని DGFT వెల్లడించింది..ఇతర దేశాలు నేరుగా భారత ప్రభుత్వంను అభ్యర్థిస్తే,,ఇందుకు భారతదేశం అనుమతిస్తే,, ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది..ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి కాగా వాటిని బంగ్లాదేశ్, మలేషియా, UAE దేశాలు దేశీయ ఉల్లిని దిగుమతి చేసుకున్నాయి..ఖరీఫ్ సీజన్ లో ఉల్లి నిల్వలు తగ్గడంతో మార్కెట్ లో ఉల్లి ధరలు క్రమేపీ పెరగడం ప్రారంభించాయి..ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించడంతో దేశీంగా ఉల్లిధరలు అదుపులో వుంటాయి.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

9 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

13 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

17 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

2 days ago

This website uses cookies.