AMARAVATHI

రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమస్యే లేదు-పవన్

అమరావతి: రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమస్యే లేదని,జనసేన పార్టీని అధికారం దిశగా నడిపే బాధ్యత తనకు వదిలి వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.అదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన ‘కౌలురైతు భరోసా’ యాత్రలో పవన్ పాల్గొన్నారు. 210 మంది రైతు కుటుంబాలకు రూ.లక్ష రూపాయలు సాయం అందచేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ  తన ‘వారాహి’ని ఆపితే తానేంటో చూపిస్తానంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరన్నారు. ‘అంబటి’ కాపుల గుండెల్లో కుంపటిగా వున్నడు,,పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని,,మరలా వైసీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో తనకు వదిలేయాలని,,తనను నమ్మాలన్నారు. తాను ఎక్కడికీ పారిపోనని,,మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలోనే ఉంటానన్నారు. తప్పు చేస్తే తన చొక్కా పట్టుకుని నిలదీయొచ్చని అన్నారు.తనను వారాంతపు పొలిటీషియన్ అంటూ విమర్శలు చేస్తారని,, వారానికి ఒక రోజు వస్తేనే ఇంత గోల చేస్తున్నారు,, రోజూ ప్రజల్లో ఉంటే ఇంకెంత గోల చేస్తారంటూ వ్యాఖ్యనించారు.”మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు,,అక్రమాలు,, దోపిడీలు చేసి సంపాదించిన డబ్బులు లేవు,, వేల కోట్ల విరాళాలు రావు,, సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్నా,,మీలాంటి వాళ్లు తృణమో పణమో ఇస్తే 9 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నా” అంటూ చెప్పారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని,,ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాలేమని తెలిసి,, వైసీపీ నేతలు రాష్ట్రంలో హింసకు పాల్పడే అవకాశం ఉందని,, అయినా ఎలాంటి భయం అవసరం లేదన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

5 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

6 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

10 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

11 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

12 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.