DISTRICTS

ఆరోగ్యశ్రీ పథకం కింద అసలు వైద్యంకు డబ్బు తీసుకొవడం ఏమిటి-కలెక్టర్

 నెల్లూరు: జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగులకు మానవత్వంతో చికిత్స అందించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఇకపై రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ చక్రధర్ బాబు సంబంధిత ఆసుపత్రుల ప్రతినిధులను ఆదేశించారు.శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ  సమావేశం నిర్వహించి ఆరోగ్యశ్రీ పథకం అమలు, వైద్య సేవల తీరుతెన్నులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి రోగుల నుంచి 193 ఫిర్యాదులు అందాయని, అందులో 57 కేసులకు సంబంధించి వైద్య చికిత్సల కోసం తీసుకున్న నగదు తిరిగి సంబంధిత రోగులకు చెల్లించారన్నారు. ఇంకా 21 కేసులకు సంబంధించి నగదు చెల్లించాల్సి ఉందన్నారు. మరో 64 కేసులు తప్పుడు కేసులుగా నిర్ధారించడం జరిగిందని, 51 కేసులు వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అసలు వైద్యం ఉచితంగా అందించాలని అటువంటిది రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం సరైనది కాదని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 21 కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.ఆరోగ్యశ్రీ పథకంలో అదనంగా కొత్తగా మరో 809 వైద్య సేవలు కలిశాయని వాటికి సంబంధించి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వైద్య చికిత్సల కోసం తిరుపతి, చెన్నైకు రెఫర్ చేసే ముందు సంబంధిత ఆసుపత్రులతో మాట్లాడి రోగి ఆరోగ్య పరిస్థితులను కూడా వారికి తెలియజేయాలని సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

5 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

20 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

20 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.