AMARAVATHI

ఆరాచక పాలనుకు ముగింపు పలికేందుకు కూటమిగా మీ ముందుకు వచ్చాం-చంద్రబాబు

అమరావతి: మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలకూడదని ఉద్దేశంతోనే పవన్ టీడీపీతో బీజేపీని కూడా కలిపి ఆరాచక పాలనుకు ముగింపు పలికేందుకు కూటమిగా మీ ముందుకు వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు..శుక్రవారం జిల్లాలోని కావలి,, వింజమూరులో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం,, సీఎం జగన్‌రెడ్డిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో గంజాయి లేని ప్రాంతం లేదని,, మళ్లీ ఈ దుర్మార్గుడికి ఓటేస్తే,, అందర్నీ గంజాయికి బానిసలుగా మారుస్తాడని ధ్వజమెత్తారు..తాను రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తే,, జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు..రాష్ట్రానికి రాజధానిని లేకుండా నాశనం చేశారని అవేదన వ్యక్తం చేశారు..ఉపాధి కోసం హైదరాబాద్, బెంగుళూరుకి వెళ్లాల్సి పరిస్థితులున జగన్ కల్పించాడన్నారు..ఉదయగిరిలో తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తానని,, సంపద సృష్టించి, నిరంతరం పేదలకు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.. కరెంటు ఛార్జీలు అప్పుడు రూ.200లు ఉంటే, ఇప్పుడు రూ.1000లు ఎలా అయ్యాయని ప్రశ్నించారు.. 5 సంవత్సరాలు కరెంటు బిల్లుల ఎంత పెరిగాయో గుర్తు చేసుకోవాలన్నారు.. జగన్ ఒక సైకో అని,, రూ.10లు ఇచ్చి రూ.100లు దోచుకున్నాడని మండిపడ్డారు.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు, పెట్రోలు, నూనె, పప్పులు, చింతపండు, చివరికి ఉప్పు ధరలు కూడా పెరిగాయని,, రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు..మద్యాన్ని తాకట్టు పెట్టి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని మండిపడ్డారు..కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సంపద సృష్టించి,, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామన్నారు.

 

Spread the love
venkat seelam

Recent Posts

రేవ్ పార్టీకి రింగ్ మాస్టారు కాకాణి-సోమిరెడ్డి

అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో…

2 hours ago

ఎన్నికల ప్రవర్తననియమావళి ఉల్లంఘన జరగకుండా చూడాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…

2 hours ago

ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు-DRO

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…

2 hours ago

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

1 day ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

1 day ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

1 day ago

This website uses cookies.