NATIONAL

కర్ణాటకలో IAS మరో IPS మహిళా అధికారిణిల మధ్య గొడవలు

అమరావతి: కర్ణాటకలో IAS మరో IPS మహిళా అధికారిణిల మధ్య స్పర్దలు, సోషల్ మీడియా వేదికగా బహిరంగమైయ్యాయి..ఇద్దరు హోదాను మరిచి వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.. IPS అధికారిణి రూప మౌద్గిల్,, IAS అధికారిణి రోహిణి సింధూరిల మధ్య ఆరోపణల సంఘటన చోటు చేసుకుంది..

ఇద్దరు మహిళా అధికారుల గొడవ పై రాష్ట్ర హోంమంత్రి అరగ.జ్ఞానేంద్ర తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి వ్యక్తిగత దూషణలు మంచివి కావని, ఇద్దరు అధికారిణిలను హెచ్చరించారు..వారి ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..అధికారులు ఇద్దరూ నిబంధనలను ఉల్లంఘించారని,,ఇలాంటి ఘటనలు చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండలేదన్నారు..ఇద్దరు అధికారులు సాధారణ వ్యక్తుల బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు..ప్రజల్లో IAS,IPSల అంటే చాలా గౌరవం ఉంటుందని,,వీరిద్దరు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణ వల్ల సివిల్ సర్వీస్ అధికారుల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పాడుతుందన్నారు..దేశం కోసం, రాష్ట్రం కోసం ఎంతో మంది IAS,IPS అధికారులు కష్టపడి పని చేస్తూ ఉంటారని,,వీరిద్దరు ప్రవర్తన వల్ల అధికారులందరికీ చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు..ఈ విషయమై తాను రాష్ట్ర డిజీపీతోను,,చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని తెలిపారు..గతంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు గురించి నా దృష్టికి వచ్చినప్పుడు వాళ్లకి నేను సర్ది చెప్పి చూశాను, అయిన వారు గొడవలు ఆపలేదని అన్నారు..వీరిద్దరిపై ఎలాంటి చర్యలు వుంటాయో వేచి చూడాలి మరి…?

2009 బ్యాచ్ కి చెందిన IAS అధికారిణి అయిన దాసరి.రోహిణి సింధూరి ముక్కు సూటిగా వ్యవహరిస్తారని పేరు వుంది..ప్రస్తుతం ఈమె కర్ణాటకలో మతం,స్వచ్ఛంద సంస్థ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు..IPS అధికారిణి D.రూప మౌద్గిల్.. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.. IAS అధికారిణి రోహిణి సింధూరి,,తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని రూప ఆరోపిస్తూ,,రోహిణిపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తూ,,కొంతమంది అధికారులతో ఉన్న ఫోటోలను రూప మౌద్గిల్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..దీనిపై రోహిణి సింధూరి స్పందిస్తూ ఈ విషయం పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని,,బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వ్యక్తిగత ద్వేషంతో తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు..రూప మానసిక సమతుల్యత కోల్పోయి ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

17 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

17 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

2 days ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

2 days ago

This website uses cookies.