వెబ్ కాస్టింగ్ ప్రక్రియ..
నెల్లూరు: జిల్లాలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు, ఇంజినీరింగ్ విద్యార్ధులకు సూచించారు.గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వెబ్ కాస్టింగ్ ప్రక్రియ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో జిల్లాఎన్నికల అధికారి చక్రధర్ బాబు పాల్గొని మాట్లాడుతూ వెబ్ కాస్టింగ్ ప్రక్రియలో పాల్గొను ప్రతి విద్యార్ధి స్వచ్ఛందంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొండటం సంతోషకరమని, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ మొదలు అయినప్పటి నుండి పూర్తి అయ్యేంతవరకు వెబ్ కాస్టింగ్ ప్రక్రియ చేపట్టాల్సి వుంటుందన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమౌతుందని, పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ప్రక్రియ ద్వారా లైవ్ కాస్టింగ్ ను ఎలాంటి అంతరాయం కల్గకుండా నిర్వహించాలని విద్యార్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, వెబ్ కాస్టింగ్ నిర్వహణ నోడల్ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ రాజశేఖర్, ఇంజినీరింగ్ విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.